Prakash Raj , Bobby Sinha : ప్రముఖ నటులు ప్రకాశ్ రాజ్‌, బాబీ సింహాలకు నోటీసులు.. అనుమతి లేకుండా అలా చేయడంతో?

నటులు ప్రకాశ్ రాజ్‌ బాబీ సింహాలకు( Prakash Raj , Bobby Sinha ) నోటీసులు జారీ చేయబోతున్నట్లు పంచాయతీ అధికారులు తాజాగా వెల్లడించారు.

అందుకు గల కారణం లేకపోలేదు.

దిండిగల్‌ జిల్లాలో ప్రముఖ వేసవి విడిది కేంద్రమైన కొడైకెనాల్ పరిధిలో అనుమతి లేకుండా ఇళ్లు నిర్మించినందుకు నోటీసులు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కొడైకెనాల్‌( Kodaikanal ) సమీపంలోని విల్‌పట్టి పంచాయతీ పరిధిలో ఉన్న పొత్తుపారై భారతి అన్నానగర్‌లో ప్రకాశ్ రాజ్ ప్రభుత్వ అనుమతి పొందకుండా ఇళ్లు, అటవీ శాఖకు సొంతమైన స్థలంలో సిమెంట్‌ రోడ్డు వేశారని ఆరోపణలు ఉన్నాయి.

Notice To Prakash Raj And Bobby Simha

కాగా అదే ప్రాంతంలో మరో నటుడు బాబీ సింహా కూడా అనుమతి పొందకుండా మూడంతస్తుల భవనం నిర్మిస్తున్నట్లు దిండుగల్‌ జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించిన గ్రీవెన్స్‌ డేలో( Grievance Day ) రైతులు ఫిర్యాదు చేశారు.అయితే కలెక్టర్‌ ఉత్తర్వుల మేరకు దిండిగల్‌ తహసీల్దార్‌ రాజా నేతృత్వంలోని అధికారుల బృందం అనుమతి లేకుండా కట్టడాలు నిర్మితమవుతున్న ప్రాంతాలు పరిశీలించారు.వీటికి ప్లానింగ్‌, పంచాయతీ, రెవెన్యూ, అటవీ శాఖల నుంచి అనుమతి పొందని పక్షంలో వివరణ కోరుతూ త్వరలోనే నోటీసు జారీ చేయనున్నట్లు తహసీల్దార్‌ తెలిపారు.

Notice To Prakash Raj And Bobby Simha

కాగా ఈ ఇద్దరు నటులు సంక్రాంతికి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi )సినిమా వాల్తేరు వీరయ్య మూవీలో మైఖేల్‌ సీజర్‌, సాల్మన్‌ సీజర్‌ పాత్రలలో అన్నదమ్ములుగా నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమా బ్లాక్‌ బస్టర్ హిట్ గా నిలిచింది.తెలుగువాడైన బాబీ సింహా తమిళ్ కూడా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.

Advertisement
Notice To Prakash Raj And Bobby Simha-Prakash Raj , Bobby Sinha : ప్రమ�

ఇకపోతే ప్రస్తుతం ఆయన తెలుగులో పలు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా కొనసాగుతున్నారు.అలాగే ప్రకాశ్ రాజ్ విలక్షణ నటుడిగా దాదాపు అన్ని భాషలలో సినిమాలు చేస్తున్నారు.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు