దసరా రిజల్ట్ తో సంతృప్తి పొందలేదు... నాని కామెంట్స్ వైరల్!

నాచురల్ స్టార్ నాని( Nani ) తాజాగా దసరా సినిమా( Dasara Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమాకు మార్చి 30వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో చిత్ర బృందం మొత్తం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు.ఇకపోతే హీరో నాని ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమా గురించి పలు విషయాలను తెలియచేశారు.

దసరా సినిమా బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కినది కావడంతో ఈ సినిమా షూటింగ్ సమయంలో బాగా ఎంజాయ్ చేసిన సీన్లు ఏమీ లేవని, ప్రతి సీన్ దుమ్ము ధూళితో కష్టపడుతూ పనిచేసామని తెలిపారు.

Not Satisfied With Dasara Result... Nani Comments Viral ,dasara, Nani, Directed

ఇక ఈ సినిమా ఎంతో మంచి విజయం అందుకున్నప్పటికీ నటుడుగా నేను ఈ సినిమా విజయంలో ఏమాత్రం సంతృప్తి పొందలేదని తెలిపారు.నేను నటించే చివరి సినిమా వరకు నాకు నటుడిగా సంతృప్తి అనేది ఉండదని నాని తెలియజేశారు.ఈ సినిమా విషయంలో హ్యాపీగా ఉన్నప్పటికీ నేను ఈ సినిమా విజయంతో సంతృప్తి చెందితే మంచి సినిమాలను చేయలేను, అందుకే ప్రతి సినిమా విషయంలోను తాను ఎప్పుడూ అసంతృప్తిగానే ఉంటాను అంటూ ఈ సందర్భంగా నాని తెలియజేశారు.

Advertisement
Not Satisfied With Dasara Result... Nani Comments Viral ,dasara, Nani, Directed

నేను ఎప్పుడైతే ఒక సినిమా విషయంలో సంతృప్తి చెందాను అంటే ఆ క్షణమే నటుడిగా నేను ఆగిపోయినట్లేనని తెలిపారు.

Not Satisfied With Dasara Result... Nani Comments Viral ,dasara, Nani, Directed

ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో చాలా సంతోషంగా ఉంది.ఇక ఈ సినిమా చూసిన తర్వాత ఎంతోమంది తనకు ఫోన్లు చేసే సినిమా అద్భుతంగా ఉంది అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారని నాని తెలియజేశారు.మేము ఈ సినిమా చేసేటప్పుడు ఎలాంటి సక్సెస్ అందుకుంటుందని భావించామో అదే స్థాయిలో ఈ సినిమా సక్సెస్ అయిందని నాని తెలిపారు.

ఇక ఈ సినిమాకు కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ( Sreekanth Odela ) దర్శకత్వం వహించగా చెరుకూరి సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇక ఇందులో నాని సరసన కీర్తి సురేష్( Keerthy Suresh ) ఎంతో అద్భుతంగా నటించారని చెప్పాలి.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు