శనిగ్రహాన్ని మాత్రమే కాకుండా ఏ గ్రహాన్ని ఇంట్లో పూజించకూడదా.. పూజిస్తే ఏమవుతుంది?

సాధారణంగా మన జాతకంలో దోషాల కారణంగా కొన్ని గ్రహాల ప్రభావం మనపై ఉండి జీవితంలో ఎన్నో కష్టాలను ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాము.

ఇలాంటి సమయంలోనే గ్రహ దోష పరిహారం చేయాలని పండితులు చెబుతుంటారు.

ఈ విధంగా గ్రహ దోష పరిహారం చేయడం వల్ల మనపై ఏ గ్రహ ప్రభావం అయితే ఉంటుందో ఆ గ్రహ ప్రభావం తొలగిపోతుంది.ముఖ్యంగా శనిగ్రహ ప్రభావంతో బాధపడే వారు ఎంతో మంది ఉంటారు.

ఒక్కసారి శని ప్రభావం మనపై పడింది అంటే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.అందుకే ఏదైనా ఆలయానికి వెళ్లి నవగ్రహ పూజ చేయించడం లేదా శని దోష నివారణ పూజలు చేయడం చేస్తుంటాము.

ఇకపోతే చాలామంది శని దేవుడి ఫోటో లేదా నవగ్రహాలను ఇంట్లో పెట్టుకుని పూజ చేయవచ్చా అనే సందేహం కలుగుతూ ఉంటుంది.అయితే ఇంటిలో  కేవలం శనీశ్వరుడి ఫోటో మాత్రమే కాకుండా నవగ్రహాల విగ్రహాలను కూడా ఇంట్లో పెట్టుకుని పూజ చేయకూడదని పండితులు చెబుతున్నారు.

Advertisement

సాధారణంగా మనం పురాతన ఆలయాలకు వెళితే అక్కడ మనకు నవగ్రహాలు కనిపించవు.కేవలం రెండు వందల సంవత్సరాల కాలంలో నిర్మించిన దేవాలయాలలో మాత్రమే మనకు నవగ్రహాలు దర్శనమిస్తుంటాయి.అంటే నవగ్రహాలను పూజించడం పూర్వకాలంలో లేదు కనుక మన ఇంట్లో కూడా ఈ విధమైనటువంటి నవగ్రహాలను పెట్టుకోకూడదని పండితులు చెబుతున్నారు.

నవగ్రహాలకు ఆ దేవదేవుడు పనులను మాత్రమే చేయటానికి ఆదేశం ఉంది.ఈ విధమైనటువంటి నవగ్రహాలను ఇంటిలో పెట్టుకోవడం వల్ల ఎన్నో ఇబ్బందులను కష్టాలను ఎదుర్కోవలసి వస్తుందని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు