Janasena Pawan Kalyan : పథకాలు ఏవి కూడా ఆగవు పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు నెలలలో ఎన్నికలు( AP Elections ) జరగనున్నాయి.దీంతో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు రకరకాల కార్యక్రమాలలో నిమగ్నమయ్యాయి.

ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ( YCP ) ఒంటరిగా పోటీకి దిగనుంది.ఇదే సమయంలో "సిద్ధం"( Siddham ) సభలతో ప్రచారం నిర్వహిస్తూ ఉంది.

మరోపక్క టీడీపీ జనసేన పార్టీలు కూటమి ఏర్పాటు చేయడం జరిగింది.ఇదే సమయంలో "రా కదలిరా"( TDP Raa Kadali Raa ) సభలతో చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉంటే బుధవారం ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ భీమా చెక్కులు అందజేశారు.

Advertisement

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మాట్లాడుతూ. జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలు ఆపేస్తారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.సీఎం జగన్ ఈ రకమైన తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు.

తాము అధికారంలోకి వస్తే మరింత సంక్షేమం( Welfare Schemes ) ఇస్తామే తప్ప ప్రస్తుత పథకాలను ఆపేది ఉండదని వెల్లడించారు.రాష్ట్ర ప్రజలకు తన జేబులో నుంచి ఒక్క పైసా కూడా ఇవ్వని వ్యక్తి సీఎం జగన్( YS Jagan ) అని విమర్శించారు.

నా సంపాదన ప్రజలకు పంచేందుకు ఎప్పుడు సిద్ధంగానే ఉంటానని పవన్ అన్నారు.తమ కూటమి అధికారంలోకి వస్తే ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా పనిచేస్తాం.ఈసారి జరగబోయే ఎన్నికలలో జనసేన టీడీపీ కూటమిని ఆశీర్వదించండి అని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.

అనుదీప్ కేవీ సీరియస్ సినిమా చేయబోతున్నాడట..?
Advertisement

తాజా వార్తలు