Nokia G42 5G Smart Phone :రూ.9999 కే నోకియా G42 5G స్మార్ట్ ఫోన్ లాంచ్.. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే..

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ నోకియా( Nokia ) నుంచి లేటెస్ట్ బడ్జెట్ నోకియా G42 5G స్మార్ట్ ఫోన్( Nokia G42 5G smartphone ) లాంచ్ అయింది.భారత మార్కెట్లో ఇప్పటికే రూ.

10 వేల బడ్జెట్ లో చాలా కంపెనీల స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.ఇప్పుడు ఈ నోకియా కొత్త వేరియంట్ తో మార్కెట్లో మరింత సెగ పుడుతుంది.

ఈ ఫోన్ కు సంబంధించిన ఫీచర్లు ఏమిటో చూద్దాం.

నోకియా G42 5G స్మార్ట్ ఫోన్:

ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణ కలిగిన 6.56 అంగుళాల HD+ డిస్ ప్లే తో ఉంటుంది.90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది.స్నాప్ డ్రాగన్ 480+5G ఆక్టా కోర్ ప్రాసెసర్ తో వస్తుంది.

Advertisement

ఈ కొత్త వేరియంట్ 4GB RAM+ 2GB virtual RAM ఫీచర్ తో రానుంది.ఇంటర్నల్ స్టోరేజ్ 128GB వరకు లభిస్తుంది.

కెమెరా విషయానికి వస్తే.50ఎంపీ AF ట్రిపుల్ AI కెమెరా( 50MP AF triple AI camera ) సిస్టమ్, OZO 3D ఆడియో రికార్డింగ్ ఫీచర్ తో పాటు ఉంటుంది.బ్యాటరీ విషయానికి వస్తే.5000mAh బ్యాటరీ సామర్థ్యంతో 20W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో ఉంటుంది.ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 OS పై పని చేస్తుంది.2 OS అప్గ్రేడ్ లకు సపోర్ట్ చేస్తుంది.నోకియా G42 5G స్మార్ట్ ఫోన్ ధర రూ.9999 గా ఉంది.ఈ ఫోన్ అమెజాన్( Amazon ) స్పెషల్, HMD.com నుండి మార్చి 8వ తేది నుండి సేల్ ప్రారంభం కానుంది.ముందుగా ఈ ఫోన్ ధర రూ.12999 గా ఉండేది.కానీ ఇప్పుడు అందించిన కొత్త వేరియంట్ తో ఈ ఫోన్ ధర రూ.9999 నుండి ప్రారంభం అవుతుంది.

Advertisement

తాజా వార్తలు