చంద్రబాబు అరెస్ట్( Chandrababu arrest ) అయిన నాటి నుండి నారా భువనేశ్వరి ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టడం జరిగింది.
ఈ క్రమంలో చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని వివరిస్తూనే పార్టీ కార్యకర్తలకు ప్రజలకు ధైర్యం చెబుతున్నారు.
పార్టీ నిర్వహించే అనేక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.కచ్చితంగా మంచి రోజులు వస్తాయని ఎవరు ఆందోళన చెందవద్దని నారా భువనేశ్వరి భరోసా ఇస్తున్నారు.
ఈ క్రమంలో "నిజం గెలవాలి" అనే కార్యక్రమంతో చంద్రబాబు అక్రమ అరెస్ట్ జరిగిన అన్యాయం ప్రజలకు భువనేశ్వరి తెలియజేస్తున్నారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నారా భువనేశ్వరి ( Nara Bhuvaneswari )సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టారు.
"చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ పై నిజం గెలవాలి అని ప్రజలతో కలిసి పోరాడుతున్నా.ఈ క్రమంలో ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు జనం చూపుతున్న ఆదరణ, కురిపించే ప్రేమ ఈ కష్ట సమయంలో మాకు ఎంతో ఊరటనిస్తోంది.
వారిచ్చే మద్దతు ఎంతో ధైర్యాన్నిస్తోంది.నన్ను కలిసిన ప్రజలు చంద్రబాబు గారి పాలనలో జరిగిన మంచి గురించి, నేటి రాక్షస పాలనలో పడుతున్న ఇబ్బందుల గురించి వివరించారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వేలాది మందికి ఉపాధి కల్పించిన టీసీఎల్ సంస్థ ప్రతినిధులు కలిసి చంద్రబాబు ( Chandrababu )గారి చొరవతో ఈ సంస్థ ఏర్పాటు అయిందని చెప్పినప్పుడు ఎంతో గర్వపడ్డా.ఇవన్నీ చూశాక మంచి ఎప్పటికైనా నిలుస్తుందని.
నిజం తప్పక గెలుస్తుందని మరింత దృఢంగా చెప్పగలుగుతున్నా" అని ట్వీట్ చేయడం జరిగింది.దీంతో తల్లి నారా భువనేశ్వరి చేసిన ట్వీట్ నీ లోకేష్ రీ ట్వీట్ చేసి.
ఔనమ్మా.గుర్తుంది.
చేసిన మంచిని ఎవరూ చెరిపేయలేరు అని కామెంట్ చేయడం జరిగింది.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy