నారింజ పండు ఎంత మంచిదైనా.. ఇలాంటి వారు మాత్రం అస్సలు తినకూడదు..!

శీతాకాలంలో ఎక్కువగా కనిపించే పండ్లలో నారింజ ముందు వరుసలో ఉంటుందని కచ్చితంగా చెప్పవచ్చు.నారింజలో ఉండే ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ముఖ్యంగా ఇందులో విటమిన్ సి శరీరానికి ఎంతగానో మేలు చేస్తుంది.అందుకే శీతాకాలంలో కచ్చితంగా నారింజను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

అయితే ఇదంతా బాగానే ఉన్న కొందరు మాత్రం నారింజ( Orange )కు వీలైనంత దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు నారింజ పండును అసలు తీసుకోకూడదు.

ఇంతకీ నారింజ పండును ఏ వ్యక్తులు తినకుండా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ముఖ్యంగా చెప్పాలంటే ఎప్పుడూ జలుబు, దగ్గు( Cold, cough )తో బాధపడేవారు నారింజకు దూరంగా ఉండటమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.నారింజలో చలవచేసే గుణాలు ఎక్కువగా ఉంటాయి.కాబట్టి జలుబు, దగ్గు ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలి.

ఒకవేళ తీసుకుంటే జలుబు, దగ్గు మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఎసిడిటీ( Acidity Problem )తో బాధపడుతున్న వారు ఆరెంజ్ ను ఎట్టి పరిస్థితులలోనూ తీసుకోకూడదు.

దీనికి కారణం ఇందులో పుల్లని కంటెంట్ ఎక్కువగా ఉండడమే అని నిపుణులు చెబుతున్నారు.కాబట్టి ఎసిడిటీతో బాధపడేవారు ఆరెంజ్ తీసుకోకూడదు.

కడుపు నొప్పి ఉన్నవారు కూడా తీసుకోకూడదు.దీని వల్ల కడుపునొప్పి ఒక్కసారిగా పెరిగిపోతుందని చెబుతున్నారు.అలాగే పంటి సమస్యలతో బాధపడే వారు కూడా ఆరెంజ్ కు దూరంగా ఉండటమే మంచిది.

రజనీకాంత్ తెలుగు సినిమాల్లో నటించకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు

ముఖ్యంగా చెప్పాలంటే కిడ్నీలో రాళ్ల సమస్యలు( Kidney Stones ) ఉన్నవారు కూడా ఆరెంజ్ ను ఎక్కువగా తీసుకోకూడదు.ఆరెంజ్ వల్ల కిడ్నీలో ఉన్న రాళ్ల వల్ల నొప్పి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది.

Advertisement

ఇంకా చెప్పాలంటే కొందరిలో ఆరెంజ్ వల్ల గుండె మంట సమస్య కూడా వస్తుంది.కాబట్టి గుండెల్లో మంట ఉన్నవారు కూడా ఆరెంజ్ కు దూరంగా ఉండాలి.

తాజా వార్తలు