వైఎస్ఆర్‎టీపీ విలీనంపై సమాచారం లేదు.. మాణిక్ రావు ఠాక్రే

కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్‎టీపీ విలీనంపై తమకు ఎటువంటి సమాచారం లేదని తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే అన్నారు.

అది అధిష్టానం పరధిలోని అంశమన్న ఆయన హైకమాండ్ తో టచ్ లో ఉన్నారో లేదో సమాచారం లేదని తెలిపారు.

తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనేనని మాణిక్ రావు ఠాక్రే పేర్కొన్నారు.బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని ప్రజలు నమ్ముతున్నారన్నారు.

బీఆర్ఎస్, బీజేపీకి బీ టీమ్ అని ఆరోపించారు.కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్లడం వలన ఒరిగేదేమీ లేదని చెప్పారు.

రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలుంటాయని తెలిపారు.పార్టీలో చేరుతున్న వారికి ఎలాంటి హామీలు ఇవ్వడం లేదని చెప్పారు.

Advertisement

సర్వేలు, గెలుపు ప్రాతిపదకనే ఎవరికైనా టికెట్లని స్పష్టం చేశారు.

Kirol Bet Bonuses And Promotions : A Value Assessment For Experienced Players
Advertisement