ముఖ్యమంత్రి పదవిపై బాబు అలా- పవన్ ఇలా!

అసలు తెలుగుదేశం జనసేన పొత్తు మొదలైన దగ్గర నుంచి ముఖ్యమంత్రి పదవిపై ఇప్పటిదాకా ఎడతెగని డిబేట్లు జరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా జనసేనతో అధికారాన్ని పంచుకుంటారని తెలుస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి పదవిపై మాత్రం ఇప్పటివరకు రెండు పార్టీల నుంచి స్పష్టమైన సంకేతాలు ఏమీ రాలేదు .

నిన్న మొన్నటి వరకు పదవుల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని జనసైనికులను ఒప్పించాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చూసినప్పటికి పార్టీ క్యాడర్లో విస్తరిస్తున్న నిస్తేజాన్ని గమనించిన తర్వాత పవన్ వాయిస్ లో కూడా మార్పు వచ్చింది.

ముఖ్యమంత్రి పదవిపై తాను, చంద్రబాబు( Chandrababu naidu ) కలసి మాట్లాడుకుని చేస్తామని చెప్పడం ద్వారా నర్మగర్భంగా తాను కూడా పదవిలో భాగస్వామ్యం పొందుతానని తన శ్రేణులను పవన్ ఊరడిస్తున్న ధోరణిలో వైజాగ్ సభలో మాట్లాడారు.

ఒకరకంగా ఇది జనసేన శ్రేణులను తిరిగి ట్రాక్లోకి తీసుకురావడానికి పవన్ వదిలిన బాణంగా చెప్పుకోవచ్చు.అయితే తెలుగుదేశం తరఫునుంచి ఈ విషయంలో మాత్రం ఎటువంటి సంకేతాలు కనిపించడం లేదు.పైగా ఒంగోలు బాపట్ల లో తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులను పరామర్శించడానికి వెళ్ళిన చంద్రబాబు తాను అధికారంలోకి రాగానే రైతులకు న్యాయం చేస్తానంటూ మాట్లాడటం చూస్తే ఆయన ఎక్కడా పవన్ ప్రస్తావన తీసుకురాకపోవడం గమనార్హం

పొత్తుధర్మం పై జనసేనాని స్పష్టమైన లక్ష్యంతో ఉన్నట్లు కనిపిస్తున్నా తెలుగుదేశం వైపు నుంచి మాత్రం పరిస్థితి క్రమంగా తమకు అనుకూలంగా మారుతుందని అందువల్ల పదవిపై తొందరపడి మాట ఇవ్వకూడదన్న ఆలోచన కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.మరి కీలక పదవి పై మొండి చెయ్యి చూపిస్తే పవన్ వైఖరి ఎలా మారుతుందో చూడాలి.ఇప్పటికే చాలా దూరం కలిసి ప్రయాణం చేసేసారు కాబట్టి ఇక కంటిన్యూ అవుతారా లేక మొత్తానికి తెగతెంపులు చేసుకొని బిజెపి( BJP )తో కలిసి నడుస్తారా అన్నది చూడాల్సి ఉంటుంది .ఏది ఏమైనా తనంతట తాను ముందుకు వచ్చి మద్దతు ఇవ్వటం అన్నది ఇప్పుడు జనసేన పార్టీ కి అతిపెద్ద ప్రతిబందం గానే మారినట్లు చెప్పవచ్చు.

Advertisement
స‌మ్మ‌ర్‌లో బీర‌కాయ తింటే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?

తాజా వార్తలు