మార్చి, ఏప్రిల్ నెలల్లో పెద్ద సినిమాల రిలీజ్ లేనట్టేనా.. ఆ సినిమాల వల్లే ఈ పరిస్థితా?

టాలీవుడ్ ఇండస్ట్రీకి ముఖ్యమైన సీజన్లలో సమ్మర్ సీజన్ ఒకటి.

సమ్మర్ కానుకగా విడుదలైన సినిమాలలో యావరేజ్ సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తాయి.

ఈ ఏడాది సమ్మర్ కానుకగా హరిహర వీరమల్లు,( Hari Hara Veeramallu ) రాజాసాబ్ ( Rajasaab ) సినిమాలు రిలీజ్ కావాల్సి ఉండగా ఈ రెండు సినిమాలు వేర్వేరు కారణాల వల్ల వాయిదా పడ్డాయి.ఈ సినిమాలు వాయిదా పడటం అభిమానులకు ఒకింత షాకిచ్చింది.

సమ్మర్ కానుకగా రిలీజ్ కానున్న సినిమాల్లో కన్నప్ప( Kannappa ) మాత్రమే అంతో ఇంతో పెద్ద సినిమా కాగా ఈ సినిమా కమర్షియల్ గా ఏ రేంజ్ కు చేరుకుంటుందో చూడాలి.ప్రభాస్ ఈ సినిమాలో 15 నుంచి 20 నిమిషాల పాటు కనిపించనున్నారని సమాచారం అందుతోంది.

ఈ నెలలో ఇప్పటివరకు పెద్ద సినిమాలేవీ రిలీజ్ కాలేదు.ఈ నెలలో పెళ్లి కాని ప్రసాద్, రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ లాంటి చిన్న సినిమాలు రిలీజ్ కానున్నాయి.

No Big Movie In March And April This Year Details, Tollywood Movies, Summer Telu
Advertisement
No Big Movie In March And April This Year Details, Tollywood Movies, Summer Telu

ఏప్రిల్ నెలలో కన్నప్ప సినిమాతో పాటు జాక్, సారంగపాణి జాతకం విడుదల కానుండగా మరికొన్ని సినిమాలు వాయిదా పడ్డాయి.మే నెలలో మాత్రం హిట్3,( Hit 3 ) హరిహర వీరమల్లు, కింగ్ డమ్ సినిమాలు రిలీజ్ కానుండగా ఈ మూడు సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాలి.

No Big Movie In March And April This Year Details, Tollywood Movies, Summer Telu

ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు చెప్పిన తేదీకి విడుదల కావడం లేదు.మే నెలలో రిలీజ్ కానున్న సినిమాలైనా చెప్పిన తేదీకి విడుదలవుతాయో లేక ఆ సినిమాల రిలీజ్ డేట్లు మారతాయో చూడాల్సి ఉంది.ఈ సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.2025 టాలీవుడ్ ఇండస్ట్రీకి మరింత కలిసిరావాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.టాలీవుడ్ పెద్ద సినిమాలలో కొన్ని సినిమాల రిలీజ్ డేట్లకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు