ఎన్టీఆర్ మాటంటే ఆ హీరోయిన్ కు లెక్క లేదా.. అలా చేయమని చెబుతూ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) ఏదైనా ఒక మాట మాట్లాడే ముందు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారనే సంగతి తెలిసిందే.

విశ్వక్ సేన్( Vishwak sen ) స్వీయ దర్శకత్వంలో సినిమాలు చేయడంపై ఎన్టీఆర్ స్పందిస్తూ అలా చేయవద్దని సూచించడం జరిగింది.

విశ్వక్ సేన్ ధమ్కీ రిజల్ట్ ను బట్టి డైరెక్షన్ కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.అయితే నివేదా పేతురాజ్( Niveda pethuraj ) మాత్రం విశ్వక్ సేన్ కు డైరెక్టర్ గా కెరీర్ ను కొనసాగించాలని సూచించారు.

దాస్ కా ధమ్కీ విశ్వక్ సేన్ కెరీర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుందని నివేదా పేతురాజ్ తెలిపారు.ఓరి దేవుడా సినిమాలో నాకు ఛాన్స్ వచ్చిందని అయితే రోల్ సరిపోదని నో చెప్పానని ఆమె అన్నారు.

విశ్వక్ సేన్ డైరెక్ట్ చేయడం మరీ స్పెషల్ అని యూనిక్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నివేదా పేతురాజ్ పేర్కొన్నారు.ప్రొడ్యూసర్ రోల్ కు విశ్వక్ న్యాయం చేశారని ఏం కావాలన్నా సమకూర్చారని నివేదా తెలిపారు.

Niveda Pethuraj Comments About Vishwak Sen Direction Details, Niveda Pethuraj, V
Advertisement
Niveda Pethuraj Comments About Vishwak Sen Direction Details, Niveda Pethuraj, V

త్రివిక్రమ్ తర్వాత అంతటి ఎనర్జీ ఉన్న దర్శకుడు విశ్వక్ సేన్ అని డైరెక్టర్ గా అతనికి మంచి భవిష్యత్తు ఉందని నివేదా తెలిపారు.అయితే ఎన్టీఆర్ మాటంటే నివేదాకు లెక్క లేదా అంటూ కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.ఎన్టీఆర్ కామెంట్లు విని కూడా నివేదా ఈ విధంగా రియాక్ట్ కావడం ఏంటని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Niveda Pethuraj Comments About Vishwak Sen Direction Details, Niveda Pethuraj, V

ధమ్కీ సక్సెస్ సాధిస్తే తెలుగులో నివేదా పేతురాజ్ బిజీ అయ్యే ఛాన్స్ ఉంది.ప్రస్తుతం విశ్వక్ సేన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది.విశ్వక్ సేన్ కెరీర్ పరంగా మరింత బిజీ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు