కేరళలో నిపా వైరస్ కలకలం.. ఇద్దరు మృతి

భారత్ లో మరోసారి నిపా వైరస్ తీవ్ర కలకలం సృష్టిస్తోంది.తాజాగా కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లాలో నిపా వైరస్ లక్షణాలతో ఇద్దరు మృత్యువాత పడ్డారు.

వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం నిపాతో మృతిచెందిన వ్యక్తుల కుటుంబ సభ్యులను ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తుంది.కాగా 2018 మరియు 2021 వ సంవత్సరంలో కోజికోడ్ జిల్లాలోనే అనేక నిఫా వైరస్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

నిపా ప్రధానంగా మెదడుకు ఇన్ఫెక్షన్ కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు.వైరస్ శరీరంలోకి ప్రవేశించిన ఐదు నుంచి 14 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు.

మెదడువాపు కారణంగా తలనొప్పి, వాంతులు, జ్వరం వంటి లక్షణాలు ఉంటాయని వెల్లడించారు.కాగా ఈ వైరస్ ప్రధానంగా జంతువుల నుంచి వ్యాప్తి చెందుతోందని వైద్యులు స్పష్టం చేశారు.

Advertisement
పచ్చి కొబ్బరి తినడం వల్ల ఆరోగ్యానికి లాభాలు అన్ని ఉన్నాయా..

తాజా వార్తలు