18 పేజీస్ బట్టీ కొడుతున్న నిఖిల్

మనం చిన్నప్పుడు స్కూల్లో పాఠాలు బట్టీ కొట్టి మరీ టీచర్లకు అప్పగించే వాళ్లం.ఇప్పటికీ కందరు రాజకీయ నాయకులు అలానే చేస్తుంటారు.

ఈ విషయాన్ని పక్కనబెడితే, ఇప్పుడు ఓ హీరో కూడా ఇలాగే చేస్తూ కెమెరాకు అడ్డంగా దొరికిపోయాడు.ఇంతకీ అసలు మ్యాటర్ ఏమిటంటే.

యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 18 పేజీస్ ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుపుకుంటోంది.ఈ సినిమా షూటింగ్ పనులు ఇటీవల పూర్తి కావడంతో, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

అయితే ఈ సినిమా డబ్బింగ్ పనులు జరుగుతున్నట్లు హీరో నిఖిల్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఓ పోస్ట్ పెట్టాడు.ఇది చూసిన ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

కరోనా కాలంలో కూడా తన దర్శకనిర్మాతల కోసం సినిమాను పూర్తి చేస్తున్నాడంటూ నిఖిల్‌ను వారు ఆకాశానికి ఎత్తేస్తున్నారు.ఇక ఈ సినిమాలో నిఖిల్ చాలా రిఫ్రెషింగ్ లుక్‌లో కనిపిస్తాడని, ఆడియెన్స్ ఆయన పర్ఫార్మెన్స్‌కు థ్రిల్ కావడం ఖాయమని చిత్ర యూనిట్ షరామామూలే గొప్పలు చెబుతోంది.

కాగా ఈ సినిమాలో నిఖిల్ సరసన అందాల భామ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది.ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీలో ఆడియెన్స్ మెచ్చే అంశాలు పుష్కలంగా ఉన్నాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

కాగా ఈ సినిమాకు కథను స్టార్ డైరెక్టర్ సుకుమార్ అందించడం విశేషం.సుకుమార్ రైటింగ్స్, GA2 పిక్చర్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండగా, గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఇక ఈ సినిమాను పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేస్తున్నాడు.మరి ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనే అంశంపై చిత్ర యూనిట్ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

తెలుగు తెరకు కృష్ణ పరిచయం చేసిన హీరోయిన్లు ఎవరో తెలుసా?

ఏదేమైనా నిఖిల్ ఈ సినిమాతో మరో హిట్ అందుకోవడం ఖాయమని ఆయన అభిమానులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు