అఖిల్ ప్లేస్ లోకి వచ్చిన నిఖిల్...

టాలీవుడ్( Tollywood ) మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రాంచరణ్( Ramcharan ) ప్రజెంట్ గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్నాడు.

ఆర్ ఆర్ ఆర్( RRR ) సినిమాతో వరల్డ్ లోనే టాప్ హీరో గా పేరు తెచ్చుకున్నాడు అన్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రాంచరణ్ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సినిమాలను నిర్మిస్తున్నాడు.ఈ క్రమంలోనే రీసెంట్ గా చరణ్ నిర్మాత విక్రమ్ రెడ్డి( Produced by Vikram Reddy ) కలిసి వి మెగా పిక్చర్స్ అనే బ్యానర్ ని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

Nikhil Came To Akhils Place, Nikhil , Tollywood, Produced By Vikram Reddy, Ramc

ఈ నిర్మాణ సంస్థలో కొత్త టాలెంట్ ప్రోత్సహిస్తూ నిర్మించాలని ఇందులో భాగంగానే ఈ నిర్మాణ సంస్థలు ఫస్ట్ పిక్చర్ అఖిల్ తో తీయబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది .అయితే రీసెంట్గా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ ఆ ఆలోచనను విరమించుకున్నారట .అఖిల్ ప్లేస్ లో కార్తికేయ 2( Karthikeya 2 ) లాంటి బిగ్ హిట్ కొట్టిన నిఖిల్ తో ఓ సినిమాని తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారట.అభిషేక్ అగర్వాల్ సంస్థ కూడా జతకానుంది అంటూ తెలుస్తుంది.

Nikhil Came To Akhils Place, Nikhil , Tollywood, Produced By Vikram Reddy, Ramc

దీనికి సంబంధించి అఫిషియల్ ప్రకటన కూడా రాబోతుంది అంటూ అధికారికంగా ప్రకటించారు టీం ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో రామ్ చరణ్ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది .అంతేకాదు అక్కినేని అఖిల్ – చరణ్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్.సడన్ గా ఎందుకు అఖిల్ ని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించి నిఖిల్ ని పెట్టుకోబోతున్నాడు అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

Advertisement
Nikhil Came To Akhil's Place, Nikhil , Tollywood, Produced By Vikram Reddy, Ramc

అయితే ఈ విషయంలో రామ్ చరణ్ ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.ఇక నిఖిల్ విషయానికి ఆయన ఇంతకు ముందు చేసిన 18 పేజెస్ మువి ప్లాప్ అయ్యింది.

అందుకే ఇక మీదట చేసే సినిమాల మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టు గా తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు