సౌత్ సినిమాలకు గుడ్ బై చెప్పేసిన పవన్ బ్యూటీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి కొమురం పులి అనే సినిమాలో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ నిఖిషా పటేల్ అందరికీ గుర్తుండే ఉంటుంది.

ఆ సినిమాలో పవన్ తరువాత ఎవరైనా ఆకట్టుకున్నారంటే ఈ బ్యూటీయే.

కానీ ఆమెకు ఆ సినిమా ఎలాంటి మేలు చేయలేదనే చెప్పాలి.అట్టర్ ఫ్లాప్ మూవీగా వచ్చిన కొమురం పులి తరువాత పెద్ద స్టార్లతో సినిమాలు చేసి ఇండస్ట్రీని ఏలేద్దామని అనుకున్న ఈ బ్యూటీ ఆశ నిరాశగానే మిగిలింది.

కొమురం పులి సినిమాతో మంచి గుర్తింపు వచ్చినా పెద్దగా అవకాశాలు మాత్రం రాలేదు.దీంతో ఆమె వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకోవాలని ఫిక్స్ అయ్యింది.

మీడియం, చిన్నా అనే తేడా లేకుండా చాలా మంది హీరోలతో నటించింది.కానీ ఏ ఒక్కటి కూడా ఆమెకు వర్కవుట్ కాలేదు.

Advertisement

దీంతో తెలుగులో సినిమా ఛాన్సులు తక్కువై పోయాయి.అటు ఫోటోషూట్‌లతో దర్శకనిర్మాతలను ఆకట్టుకునే ప్రయత్నం చేసినా పెద్దగా వర్కవుట్ కాలేదు.

దీంతో తెలుగు సినిమాలతో పాటు తమిళంలో కూడా అవకాశాలు రాకపోవడంతో ఈ బ్యూటీ సౌత్ సినిమాలకు గుడ్ బై చెప్పేసి లండన్ చెక్కేయడానికి నిర్ణయించుకుంది.లండన్‌కు చెందిన ఓ ఏజెన్సీతో నిఖిషా కాంట్రాక్ట్ కుదుర్చుకుంది.

దీంతో బ్రిటిష్ టెలివిజన్‌లో ఎంట్రీ ఇవ్వడానికి ఆమె అక్కడికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.చేతిలో ఉన్న తమిళ సినిమాలను పూర్తి చేసి పూర్తిగా సౌత్ సినిమాలకు గుడ్ బై చెప్పాలని అమ్మడు నిర్ణయం తీసుకోవడంతో ఆమెను ఇష్టపడే వారు ఆందోళన చెందుతున్నారు.

తాజా వార్తలు