అల్లు అర్జున్ వర్సెస్ నాగబాబు వివాదంపై స్పందించిన నిహారిక.. ఏమన్నారంటే?

మే నెలలో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా మెగా కుటుంబం అల్లు కుటుంబం మధ్య పెద్ద ఎత్తున వివాదం చోటు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

మెగా కుటుంబ సభ్యుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) కూటమిలో భాగంగా పిఠాపురం నుంచి పోటీ చేశారు.

ఇక ఈయన పోటీ చేస్తున్న తరుణంలో సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈయనకు మద్దతు తెలిపారు.ఇక మెగా కుటుంబ సభ్యులందరూ కూడా పిఠాపురం వెళ్లి ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ తరుణంలోనే అల్లు అర్జున్ ( Allu Arjun ) వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి ( Shilpa Ravi ) మద్దతు తెలుపుతూ నంద్యాల వెళ్లడంతో రెండు కుటుంబాల మధ్య వివాదం చెలరేగింది.

Niharika React On Allu Arjun And Nagababu Issues ,allu Arjun, Nagababu, Niharika

ఇలా అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలపడంతో నాగబాబు( Nagababu ) సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ ని ఉద్దేశిస్తూ చేసిన పోస్టులు సంచలనంగా మారాయి.ఇక మెగా సంబరాలకు కూడా అల్లు ఫ్యామిలీ దూరంగా ఉన్నారు.దీంతో ఈ రెండు కుటుంబాల మధ్య భారీ స్థాయిలో దూరం పెరిగిపోయిందని తెలుస్తుంది.

Advertisement
Niharika React On Allu Arjun And Nagababu Issues ,Allu Arjun, Nagababu, Niharika

అదేవిధంగా పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవడంతో సాయిధరమ్( Sai Dharam Tej ) తేజ్ ఏకంగా అల్లు అర్జున్ దంపతులను సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసిన సంగతి తెలిసిందే.

Niharika React On Allu Arjun And Nagababu Issues ,allu Arjun, Nagababu, Niharika

ఇలా ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న విభేదాలపై తాజాగా నిహారిక( Niharika ).స్పందించారు.నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి అల్లు అర్జున్ మద్దతు ఇవ్వడం గురించి మా కుటుంబంలో ఎలాంటి చర్చలు జరగలేదని తెలిపారు.

నాగబాబు ఈ విషయంలో హర్ట్ అయ్యి సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేయడం గురించి కూడా ఈమె స్పందించారు.మా నాన్న ఎక్స్ లో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు.

వాట్సాప్ లో కూడా ప్రతిరోజు ఏదో ఒక సూక్తి పెడుతూ ఉంటారు.ఆయన దేని గురించి పెట్టారో నాకు తెలియదు.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

కానీ ఇంట్లో అయితే ఈ టాపిక్ ఎప్పుడు చర్చకు రాలేదని, అయినా ప్రతి ఒక్క విషయంలో ఎవరి సొంత నిర్ణయం వారికి ఉంటుంది అంటూ ఈ సందర్భంగా నిహారిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు