ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న మెగా డాటర్ నిహారిక కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబంలో మెగా కుటుంబం ఒకటి.

ఈ కుటుంబం నుంచి హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి  అడుగుపెట్టిన వారిలో నిహారిక(Niharika ) ఒకరు.

ఈమె కెరియర్ మొదట్లో బుల్లితెర యాంకర్(TV anchor) గా తన ప్రస్థానం మొదలుపెట్టి అనంతరం హీరోయిన్గా నటించారు.ఇలా తెలుగులో మూడు సినిమాలు చేసిన నిహారికాకు ఏ ఒక్క సినిమా కూడా హిట్ అందించలేకపోయింది.

దీంతో ఈమె పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లడం, భర్తతో విభేదాలు కారణంగా విడిపోవడం కూడా జరిగింది.

ఇలా విడాకులు తీసుకున్న తర్వాత నిహారిక (Niharika)తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు.ఈ క్రమంలోనే తిరిగి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి పలు వెబ్ సిరీస్ లలో నటించారు.అదేవిధంగా నిర్మాతగా మారి ఒకవైపు వెబ్ సిరీస్ (Web series)లను నిర్మిస్తూనే మరోవైపు సినిమాలను కూడా నిర్మిస్తూ వచ్చారు.

Advertisement

ఇటీవల నిహారిక నటించిన కమిటీ కుర్రాళ్ళు సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఇలా నిర్మాతగా కూడా నిహారిక సక్సెస్ అందుకున్నారు.

ఇలా ఒకవైపు నిర్మాతగా కొనసాగుతూనే మరోవైపు సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే తమిళంలో నిహారిక నటించిన చిత్రం మద్రాస్ కారన్(Madraskaaran).షేక్ నిగమ్ హీరోగా నటించిన ఈ సినిమాలో నిహారిక హీరోయిన్ పాత్రలో నటించారు.

ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 10వ తేదీ విడుదల అయింది అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదలైన నెల రోజులలోపే తిరిగి ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో(Aha ) ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రసారం కాబోతుందని స్వయంగా ఆహా అధికారక ప్రకటన వెల్లడించింది.అయితే ఈ సినిమా కేవలం తమిళ వర్షన్ లో మాత్రమే అందుబాటులోకి రాబోతోంది.

ఆ డిజాస్టర్ సినిమా వల్ల సూర్య సినిమాలో ఛాన్స్.. పూజా హెగ్డే కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు