వెబ్ సిరీస్ లపైనే ఫోకస్ పెట్టిన మెగా డాటర్ నిహారిక

మెగా ఫ్యామిలీ నుంచి డజను మందికి పైగా హీరోలు ప్రస్తుతం ఉన్నారు.అలాగే హీరోయిన్ గా నిహారికా కొనెదల ఎంట్రీ ఇచ్చింది.

ముందుగా వెబ్ సిరీస్ లతో నటిగా తెరంగేట్రం చేసిన నిహారిక తరువాత ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా బిగ్ స్క్రీన్ లోకి ఎంట్రీ ఇచ్చింది.మొదటి సినిమా ఆమెకి నటిగా గుర్తింపు తీసుకొచ్చిన కమర్షియల్ సక్సెస్ ఇవ్వలేదు.

తరువాత మరో మూడు సినిమాలలో నిహారికా హీరోయిన్ గా నటించిన.అందులో ఏ ఒక్కటి కమర్షియల్ గా సక్సెస్ కాలేదు.

సినిమా రిలీజ్ కి ముందు వచ్చిన హైప్ రిలీజ్ తర్వాత పోయింది.ఆమె ఎంచుకున్న కథలలో చాలా వరకు సీరియస్ పాత్రలే కావడం, ఆమె ఒరిజినల్ క్యారెక్టర్ కి కంప్లీట్ అపోజిట్ గా అవి ఉండటంతో నిహారికా హీరోయిన్ గా సక్సెస్ కాలేదనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది.

Advertisement
Niharika Konidela Web Series Journey, Tollywood, Mega Family, Megastar Chiranjee

అయితే వెబ్ సిరీస్ లలో మాత్రం నిహారిక తనని తనని తాను ప్రూవ్ చేసుకుంది.

Niharika Konidela Web Series Journey, Tollywood, Mega Family, Megastar Chiranjee

ఈ నేపధ్యంలో సినిమాలని పూర్తిగా పక్కన పెట్టి వెబ్ సిరీస్ లపైనే దృష్టి పెట్టింది.పెళ్లి తర్వాత నటనకి ఫుల్ స్టాప్ పెట్టేస్తుందని అందరూ భావించిన.అలాంటిదేం లేదని ఆమె కూడా క్లారిటీ ఇస్తూ వెబ్ సిరీస్ స్టార్ట్ చేసింది.

ఆ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా స్టార్ట్ అయిపొయింది.మరో వైపు ఆమె కూడా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి వెబ్ సిరీస్ లు నిర్మించే పనిలో పడింది.

అందులో భాగంగా ఒక వెబ్ సిరీస్ ని తెరకెక్కిస్తుంది.ఒటీటీ ఛానల్స్ రావడంతో వీటికి ఫ్యూచర్ లో మంచి డిమాండ్ ఎలాగూ ఉంటుంది కాబట్టి వెండితెరకంటే డిజిటల్ స్క్రీన్ బెటర్ అనే అభిప్రాయంతో మెగా డాటర్ తన కెరియర్ ని ఈ విధంగా బిల్డ్ చేసుకుంది.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే

ఇదిలా ఉంటే మెగాస్టార్ పెద్ద కూతురు సుస్మిత కూడా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి వెబ్ సిరీస్ లని నిర్మించే పనిలో పండింది.అలాగే నిర్మాతగా త్వరలో సినిమా కూడా చేయనుంది.

Advertisement

మొత్తానికి మెగా డాటర్స్ కూడా తమ ఫ్యామిలీ ప్రొఫెషన్ లోకి పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇచ్చేసి సక్సెస్ అందుకునే పనిలో పడ్డారని చెప్పాలి.

తాజా వార్తలు