పబ్ ఇష్యు తర్వాత మొదటి సారి భర్తతో నిహారిక.. నెట్టింట్లో ఫోటోలు వైరల్!

మెగా డాటర్ నిహారిక గురించి మన అందరికీ తెలిసిందే.ఈమె కరోనా సమయంలో జొన్నలగడ్డ చైతన్య ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

అయితే పెళ్లికి ముందు ఎలా అయితే చలాకీగా అల్లరిగా ఉందో పెళ్లి తర్వాత కూడా అలాగే ఉంది.పెళ్లి తరువాత ఈమె నిర్మాతగా బాధ్యతలు చేపడుతోంది.

ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో నిహారిక పేరు ఎక్కువగా సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది.ఇటీవలే ఈ ఫుడ్ అండ్ మింక్ పబ్బు రైడ్ లో దాడులు నిర్వహించగా ఆ పబ్ లో నిహారిక ఉండటం సెన్సేషన్ గా మారిన విషయం తెలిసిందే.

హైదరాబాద్ టాస్క్‌ ఫోర్స్ పోలీసులు జరిపిన దాడిలో నిహారికతో పాటుగా బిగ్‌బాస్‌ విన్నర్‌, సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌ సహా పలువురు ప్రముఖుల పిల్లలు ఉండటం తీవ్ర చర్చకు దారి తీసింది.అయితే వీరితో పాటు మొత్తం 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు.

Advertisement

కానీ వీరు సెలబ్రిటీ పిల్లలు కావడంతో వీరి పేర్లే ఎక్కువగా మారుమోగాయి.ఇకపోతే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నిహారిక ఎక్కడా కనిపించలేదు.

అంతేకాకుండా ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆమె ఇంస్టాగ్రామ్ అకౌంట్ కూడా డిలీట్ చేసింది.

ఇక అప్పటి నుంచి నిహారిక కు సంబంధించిన ఎటువంటి వార్త కూడా సోషల్ మీడియాలో వినిపించలేదు.అయితే ఆ వివాదం జరిగిన తర్వాత తొలిసారి నిహారిక తన భర్త చైతన్యతో కలిసి ఒక ఈవెంట్ లో కనిపించింది.హలో వరల్డ్ అనే పేరుతో నిహారిక నిర్మిస్తున్న ఓ వెబ్ సిరీస్ ఓపెనింగ్ ఈవెంట్ లో భర్తతో కలసి సందడి సందడి చేసింది.

ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వివాదం తర్వాత నిహారిక ని చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆరోగ్యానికి సమోసా మంచిదా? బర్గర్ మంచిదా?.. అధ్యయనంలో తేలిందిదే...
Advertisement

తాజా వార్తలు