తనతో కలిసి నైట్ అంతా ఎంజాయ్ చేస్తూనే ఉన్నా... నిహారిక కామెంట్స్ వైరల్!

మెగా డాటర్ నిహారిక(Niharika) గత కొంతకాలంగా తన వ్యక్తిగత కారణాల వల్ల సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు.

ఈమె గత కొంతకాలంగా తన భర్తతో దూరంగా ఉంటున్నారని వీరిద్దరూ విడాకులు(Divorce) కూడా తీసుకోబోతున్నారు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో నిహారిక మాత్రం ఈ వార్తలు గురించి ఏ మాత్రం స్పందించకుండా ఈ వార్తలను ఖండించే ప్రయత్నం చేయకుండా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే నిహారిక ఎప్పటికప్పుడు ఫోటోషూట్లు నిర్వహిస్తూ తన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ సందడి చేస్తున్నారు.

Niharika Konidela Enjoys With Influencer Niharika Pics Viral Details, Niharika,i

ప్రస్తుతం నిర్మాణ రంగంలో కొనసాగుతున్నటువంటి ఈమె తిరిగి సినిమాలలో కూడా నటించబోతున్నారని అందుకే పెద్ద ఎత్తున ఫోటోషూట్లు చేయడమే కాకుండా సినిమాలకు అనుగుణంగా భారీగా వర్కౌట్ చేస్తూ జిమ్ లో కూడా ఎక్కువగా సమయం గడుపుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.తాజాగా నిహారిక హైదరాబాద్లో ఆఫీస్ కూడా ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే.ఇకపోతే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ అయిన నిహారిక తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోని షేర్ చేశారు.

ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది.

Niharika Konidela Enjoys With Influencer Niharika Pics Viral Details, Niharika,i
Advertisement
Niharika Konidela Enjoys With Influencer Niharika Pics Viral Details, Niharika,i

నిహారిక సోషల్ మీడియాలో ఇంఫ్లూయెన్సర్ నిహారికతో( Influencer Niharika ) కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ.మూవీ టైం అంటూ ల్యాప్ ట్యాప్‌లో సినిమాను చూస్తూ, స్నాక్స్ తింటూ సందడి చేసినట్టుగా తెలుస్తోంది.ఇలా వీరిద్దరూ ఒకే చోట ఉండి రాత్రంతా చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే వీరిద్దరి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇంఫ్లూయెన్సర్ నిహారిక కూడా సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే.

ఇక ఏదైనా సినిమాలు కనుక విడుదల అవుతూ ఉంటే పెద్ద ఎత్తున ఈమె ఇంటర్వ్యూలు చేయడం ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించడం లాంటిది కూడా చేస్తుంటారు.

డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!
Advertisement

తాజా వార్తలు