పవర్ స్టార్ పవన్ నుంచి ఆ లక్షణం నేర్చుకోవాలి.. నిధి అగర్వాల్ కామెంట్స్ వైరల్!

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ నిధి అగర్వాల్( Heroine Nidhi Agarwal ) గురించి మనందరికీ తెలిసిందే.

తెలుగులో పలు సినిమాలలో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది నిధి అగర్వాల్.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాతో పాటు, ప్రభాస్ హీరోగా నటించిన ది రాజా సాబ్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.త్వరలోనే ఈ రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నారు నిధి అగర్వాల్.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ.

Nidhhi Agerwal About Her Upcoming Projects With Pawan Kalyan And Prabhas, Nidhhi

పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )గురించి ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా నిధి అగర్వాల్ మాట్లాడుతూ.నేను స్టార్‌ కిడ్‌ని కాదు.

Advertisement
Nidhhi Agerwal About Her Upcoming Projects With Pawan Kalyan And Prabhas, Nidhhi

అలాగే నాకు సినిమా నేపథ్యం కూడా లేదు.నేను నటిగా మొదటి స్థానంలో ఉండడమే పెద్ద విషయం.

సినిమాల్లో అవకాశాలు రావడమే నాకు విజయంతో సమానం.ఎక్కువ సినిమాలు చేయాలని అందరికీ ఉంటుంది.

కానీ నేను మాత్రం నమ్మకం ఉన్న కథలనే ఎంచుకుంటాను.అలాంటివాటి పై మాత్రమే దృష్టి పెడతాను.

నేనేం హీరోను కాదు.వరుసగా కమర్షియల్‌ సినిమాలు చేయడానికి, ఒకవేళ నేను వరుస సినిమాలు చేసినా నన్ను అలాంటి స్క్రిప్ట్‌ లు ఎంచుకున్నందుకు విమర్శిస్తారు.

తీహార్‌లోని మగ ఖైదీల బ్లాక్‌లో యువతి.. కళ్లారా ఏం చూసిందంటే?
హైపర్ ఆది నన్ను ఫ్లర్ట్ చేశాడు.. వైరల్ అవుతున్న దీపు నాయుడు షాకింగ్ కామెంట్స్!

అందుకే గొప్ప కథలను మాత్రమే ఎంచుకుంటున్నాను అని తెలిపింది నిధి అగర్వాల్. హరిహర వీరమల్లు మూవీలో( Harihara Veeramallu movie ) నా పాత్ర ఇప్పటి వరకు నేను చేసిన వాటిల్లో అత్యుత్తమమైనది.

Nidhhi Agerwal About Her Upcoming Projects With Pawan Kalyan And Prabhas, Nidhhi
Advertisement

ఆ పాత్ర కోసం గుర్రపు స్వారీ, క్లాసికల్‌ డ్యాన్స్‌ ( Horse riding, classical dance )లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను.అలాగే కథక్‌ కూడా నేర్చుకున్నాను.నా కల నిజమైంది.

అదృష్టవంతురాలిని అనిపించింది.అలాగే హర్రర్‌ సినిమాలంటే గతంలో భయం ఉండేది.

అందుకే ది రాజా సాబ్‌ చేయాలనుకున్నాను.ఆ చిత్ర బృందం అంతా ఫన్నీగా ఉంటుంది.

సెట్‌ లో స్క్రిప్ట్‌ చదువుతున్నప్పుడు కూడా అందరం నవ్వుతూనే ఉన్నాం అని తెలిపింది.పవన్‌ సెట్స్‌లో ఉన్నప్పుడు ఎంతో ఏకాగ్రతతో ఉంటారు.

యాక్షన్‌ చెప్పగానే పూర్తిగా లీనమవుతారు.చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోరు.

తన సన్నివేశంపై మాత్రమే దృష్టిపెడతారు.ఈ లక్షణాన్ని నేను కూడా అలవాటు చేసుకోవాలి అని తెలిపింది నిధి అగర్వాల్.

తాజా వార్తలు