కోడి కత్తి కేసు : జగన్ పై ప్లాన్ ప్రకారమే దాడి జరిగింది

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి .కలకలం రేపిన వైసీపీ అధినేత జగన్ పై విశాఖ ఎయిర్ పోర్ట్ లో కోడి కత్తి తో జరిగిన దాడి జరిగిన సంఘటన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ కీలక విషయాల్ని హైకోర్టుకు తెలియజేసింది.

వైఎస్‌ జగన్‌ను లక్ష్యంగా చేసుకునే ఉద్ధేశపూర్వకంగా హత్యాయత్నానికి ప్రయత్నించారని ఎన్‌ఐఏ హైకోర్టుకు నివేదిక అందజేసింది.కేంద్ర పారిశ్రామిక భద్రత దళం, ఇంటెలిజెన్స్‌ బ్యూరో, ఎన్‌ఐఏ, ఏపీ ప్రభుత్వ సమాచారాలన్నీంటినీ పరిశీలించాకే జగన్‌పై కావాలనే హత్యాయత్నం జరిగిందనే నిర్ణయానికి తాము వచ్చామని ఎన్‌ఐఏ తెలిపింది.

విమానాశ్రయ ఆవరణలో హత్యాయత్నం జరిగినందున ఈ కేసును దర్యాప్తు చేసే పరిధి తమదేనని ఎన్‌ఐఏ స్పష్టం చేసింది.విమానాశ్రయంలో ఆయుధాలతో లేదా ప్రాణం తీసే విధమైన వస్తువులతో దాడి చేస్తే అలాంటి కేసులను ఎన్‌ఐఏనే విచారించాలని విమానయాన సంస్థ చట్టం స్పష్టం చేస్తోందని తెలిపింది.గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు బుధవారం ఎన్‌ఐఏ తన వాదనలతో కౌంటర్‌ వ్యాజ్యాన్ని దాఖలు చేసింది.

దీనిపై తమ వాదనల్ని తెలిపేందుకు సమయం కావాలని ఏపీ ప్రభుత్వం కోరడంతో కేసు విచారణను ఫిబ్రవరి 12కి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌ ప్రకటించారు.

Advertisement
Advertisement

తాజా వార్తలు