ఇక రోడ్లు కూడా డిజిటల్‌ మయం కాబోతున్నాయి!

అవును, మీరు విన్నది నిజమే.ఇపుడు ప్రతిదీ డిజిటల్ మయం అయిపోతుంది.

మోడీ ఏ ముహూర్తాన డిజిటల్ ఇండియా( Digital India ) అని ప్రకటించాడో గాని, అప్పటినుండి దేశంలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయనే విషయం అందరికీ తెలిసినదే.ఇపుడు తాజాగా జాతీయ రహదారుల వెంట 10 వేల కిలోమీటర్ల మేర ఆప్టిక్‌ ఫైబర్‌ కేబుల్స్‌( Optic Fiber Calbles ) ఏర్పాటు చేయాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రకటించడం విశేషం.

తొలి విడతతో ప్రయోగాత్మకంగా 1,367 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఢిల్లీ-ముంబై జాతీయ రహదారితోపాటు 512 కిలోమీటర్ల మేర హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారులను డిజిటల్‌ రోడ్లుగా( Digital Roads ) అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

దానికోసం ప్రత్యేకంగా నేషనల్‌ హైవేస్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ (ఎన్‌హెచ్‌ఎల్‌ఎంఎల్‌) పేరుతో స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్‌పీవీ) కూడా ఏర్పాటు చేయడం ఇపుడు హాట్ టాపిక్ అని చెప్పుకోవాలి.ఈ క్రమంలో జాతీయ రహదారి పక్కన 3 మీటర్ల మేర డెడికేటెడ్‌ కారిడార్‌లో ఓఎఫ్‌సీ ఏర్పాటు చేస్తారు.హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారి సైతం డిజిటల్‌ రోడ్డుగా మారనుండడం విశేషంగా చెప్పుకోవచ్చు.

Advertisement

డిజిటల్‌ రోడ్ల ఏర్పాటుతో ఈ రహదారి వెంట 5జీ, 6జీ నెట్‌వర్క్‌ సేవలు లభించడంతోపాటు రహదారి వెంట ఉన్న మారుమూల ప్రాంతాలకు కూడా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది.

దానిద్వారా ఈ రహదారి వెంబడి ఐటీ, ఐటీ అనుబంధ కంపెనీల ఏర్పాటు చేసుకునే వారికి మంచి అవకాశం చేకూరుతుందని చెప్పుకోవచ్చు.ఎందుకంటే జాతీయ రహదారి వెంట ఇంటర్నెట్‌ సౌకర్యం అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఆయా ఐటీ కంపెనీల పంట పండినట్టే.హైదరాబాద్‌ - బెంగళూరు రహదారి వెంట ఉన్న తెలుగు రాష్ట్రాల్లో గల జడ్చర్ల, అనంతపురం, కర్నూలు, గుత్తి, హిందుపూర్‌ వంటి ప్రాంతాల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు అవకాశం బాగా ఉంటుంది.

డిజిటల్‌ రోడ్ల వల్ల టైర్‌-2, 3 పట్టణాల్లో కూడా ఐటీ కంపెనీల ఏర్పాటు చేయొచ్చు.తద్వారా అధికంగా ఉద్యోగ అవకాశాలు ఇవ్వొచ్చు.

Bets 10 Bonuses And Promotions : A Practical Welcome Bonus Breakdown
Advertisement

తాజా వార్తలు