ఏపీలో న్యూస్ ఎరీనా సంచలన సర్వే.. మళ్లీ వైసీపీదే అధికారం..!!

ఏపీలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు( Assembly elections ) రానున్నాయి.ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఆ రాష్ట్రంపైనే ఉందని చెప్పుకోవచ్చు.

సీఎం జగన్( cm jagan ) కు ప్రజలు మరోసారి పట్టం కడతారా? లేక పొత్తులతో వస్తున్న టీడీపీ - జనసేనకు( TDP - Janasena ) అవకాశం ఇస్తారా? అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.తాజాగా ఏపీలో జరిగిన ఓ సర్వే సంచలనం సృష్టిస్తుంది.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికే వివిధ సర్వేలు ఫలితాలను వెల్లడించగా.రీసెంట్ గా న్యూస్ ఎరీనా సంచలన సర్వేను( News Arena sensational survey ) విడుదల చేసింది.

రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో డిసెంబర్ 1, 2023 నుంచి జనవరి 12, 2024 తేదీ వరకు ఈ సర్వే జరిగింది.ఓటర్ల అభిప్రాయాలను నేరుగా తెలుసుకున్న న్యూస్ ఎరీనా ఈ ఫలితాలను వెల్లడించింది.

Advertisement

ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రభుత్వం అందించిన సేవలు మరియు పాలన, శాంతి భద్రతలు, ఎమ్మెల్యేల పనితీరు, మూడు రాజధానుల వ్యవహారంతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్, టీడీపీ - జనసేన పొత్తు వంటి పలు అంశాలపై ప్రజల నుంచి న్యూస్ ఎరీనా నేరుగా అభిప్రాయాలను సేకరించింది.న్యూస్ ఎరీనా సర్వే ఫలితాల్లో భాగంగా ఏపీలో వచ్చే ఎన్నికల్లో మరోసారి వైసీపీనే అధికారంలోకి రానుంది.వైనాట్ 175 నినాదంతో ముందుకెళ్తున్న వైసీపీ ఈసారి 49.14 శాతం ఓటింగ్ తో సుమారు 122 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగరవేయనుంది.అలాగే పొత్తులో ఉన్న టీడీపీ - జనసేన 44.34 శాతంతో 53 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉందని సర్వే పేర్కొంది.తరువాత కాంగ్రెస్ 1.21 శాతం, బీజేపీ 0.56 శాతం ఓట్లను సాధిస్తుందని న్యూస్ ఎరీనా సర్వేలో వెల్లడైంది.

ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ పాలన మరియు ఆయన చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలపై 59.3 శాతం మహిళలు హర్షం వ్యక్తం చేస్తుండగా 49.6 శాతం పురుషులు జగన్ పాలనకు జై కొడుతున్నారని న్యూస్ ఎరీనా సర్వే తెలిపింది.రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించినా ఇవే ఫలితాలు వస్తాయని న్యూస్ ఎరీనా సర్వే స్పష్టం చేసింది.

న్యూస్ ఎరీనా సంస్థ తెలిపిన ఫలితాల ప్రకారం ఏపీలో సీఎం వైఎస్ జగన్ పాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారని అర్థం అవుతోంది.ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో 151 సీట్లతో విజయం సాధించిన వైసీపీ ప్రస్తుతం వైనాట్ 175 నినాదంతో ముందుకెళ్తుంది.

అందించిన సంక్షేమ పథకాలు చేసిన అభివృద్ధే మరోసారి వైఎస్ జగన్ ను అధికార పీఠంపై కూర్చోబెట్టనున్నాయని తెలుస్తోంది.దీంతో ఏపీలో ఫ్యాన్ ప్రభంజనం మరోసారి కొనసాగనుంది.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు