న్యూయార్క్ లో తట్టు వ్యాధి తెస్తున్న తంటా..!!

అమెరికా వ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న తట్టు వ్యాధిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి అక్కడ ప్రభుత్వాలు.

న్యూయార్క్ నగరం మంగళ వారం సార్వజనీన ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించింది.

వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వ్యాధిని అరికట్టడంలో ప్రభుత్వం తలమునకలైంది.సంప్రదాయవాదులు అత్యధికంగా నివసించే బ్రూక్లిన్ ప్రాంతం నుంచి ఈ తట్టు వ్యాధి వస్తున్నట్టుగా గుర్తించారు.

అయితే ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా వాక్సినేషన్ చేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.బ్లూక్లిన్ లోని విలియమ్స్ బర్గ్ ప్రాంతంలో తట్టు వ్యాధి వ్యాపించడం ప్రారంభమైనట్టు గుర్తించామని న్యూయార్క్ నగర మేయర్ బిల్ డి బ్లేసియో ప్రకటించారు.

సెప్టెంబర్ నుంచీ ఇప్పటి వరకూ దాదాపు 250 మందికి పైగా తట్టు వ్యాధికి గురయ్యారని ఆయన అన్నారు.

Advertisement

ముందు నుంచీ వ్యాక్సినేషన్ ని వ్యతిరేకించేవారి కారణంగానే ఈ వ్యాధి ఇప్పుడు వ్యాప్తి చెందుతూ వచ్చిందని అన్నారు.అయితే వాక్సినేషన్ తీసుకోని వారిపై ఖటినమైన చర్యలు తీసుకునే అవకాశం లేకపోవడంతో ఈ ఆదేశాలు పాటించని వారికి 1,000 డాలర్ల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

How Modern Technology Shapes The IGaming Experience
Advertisement

తాజా వార్తలు