వైరల్‌ : తిరుమలలో ఎప్పుడు ఇదే పద్దతి ఉంటే ఎంత బాగుంటుందో కదా

కరోనా ప్రభావంతో ప్రపంచంలో అన్ని చోట్ల జీవన శైలిలో మార్పులు రావడంతో పాటు, అనేక సంస్థలు మరియు ఇతర సంఘాలు తమ కార్యకలాపాలను మార్చుకున్న విషయం తెల్సిందే.

తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కూడా కరోనా కారణంగా కొత్త నిబంధనలు తీసుకు వచ్చారు.

ఈ నిబంధనలు చాలా బాగున్నాయంటూ నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.క్యూ కాంప్లెక్స్‌లో వెయిట్‌ చేసే అవసరం లేకుండా, గంట తరపడి పడిగాపులు పడకుండా ఇది చాలా ప్రయోజనకరంగా ఉందంటున్నారు.

టీటీడీ వారు తీసుకున్న నిర్ణయం ప్రకారం గంటల తరబడి క్యూ కాంప్లెక్స్‌లో ఉండకుండా దర్శనంకు గంటలోనే పూర్తి కానుంది.దీని కోసం తిరుమల వెళ్లిన వెంటనే ఎవరైనా దర్శణంకు టికెట్‌ తీసుకోవాలి.దానిపై ఏ సమయానికి దర్శనంకు వెళ్లాలో ఉంటుంది.

తద్వారా ఖచ్చితంగా ఆ సమయంకు కాస్త అయిదు పది నిమిషాల ముందు వెళ్లారు అంటే గంటలోనే దర్శనం చేసుకోవచ్చు.ఏ సమయం అయితే ఇచ్చారో ఆ సమయం వచ్చే వరకు బయట ఎక్కడైనా ఉండవచ్చు, ఎక్కడైనా తిరిగి రావచ్చు.

Advertisement

ఈ పద్దతి ఏదో బాగుందని, గంటలతో తిరుపతి దర్శణం అంటే అంతా చాలా సంతోషిస్తున్నారు.టోకెన్‌ తీసుకున్న తర్వాత తిరుమల తిరుపతి ప్రదేశాల్లో ముఖ్యమైన చూడదగ్గవి ఏమైనా ఉంటే చూసి వచ్చేయవచ్చు.ఆ సమయంలో విశ్రాంతి కూడా తీసుకోవచ్చు అంటున్నారు.

టీటీడీ ఈ విధానంను పర్మినెంట్‌గా కంటిన్యూ చేయాలని భక్తులు కోరుకుంటున్నారు.ప్రస్తుతానికి అవగాహణ లేక పోవడం వల్ల భక్తులు రోడ్ల మీద వెయిట్‌ చేస్తారేమో కాని ముందు ముందు ఈ పద్దతితో అందరికి ప్రయోజనం కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Advertisement

తాజా వార్తలు