ఏపీలో ఇకపై ప్రభుత్వ వాహనాలకు కొత్త సిరీస్ తో నంబర్లు..!

ఏపీలో ప్రభుత్వ వాహనాలకు కొత్త సిరీస్ తో నంబర్లు రానున్నాయి.ఇందుకు గానూ మోటార్ వాహనాల చట్టంలో సవరణ చేయనున్నారని తెలుస్తోంది.

ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.కొత్త చట్ట సవరణ ప్రకారం ఇప్పటినుంచి కొనుగోలు చేసే ప్రభుత్వ వాహనాలకు ఏపీ 40జీ అనే సిరీస్ తో నంబర్లను కేటాయించనున్నారు.

అయితే ఇది కేవలం ప్రభుత్వం కొనుగోలు చేసే వాహనాలకు మాత్రమేనని సమాచారం.కాగా 2018 సంవత్సరం నుంచి రవాణా శాఖ అన్ని జిల్లాలకు కలిపి ఏపీ 39 సిరీస్ తో నంబర్లను కేటాయిస్తున్న సంగతి తెలిసిందే.

Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide
Advertisement