రాధేశ్యామ్ రిలీజ్ పోస్టర్.. పర్ఫెక్ట్ అంటున్న ఫ్యాన్స్.. ఆకట్టుకుంటున్న పోస్టర్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.వాటిల్లో రాధేశ్యామ్ ఒకటి.

రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.దాదాపు మూడన్నరేళ్ళ తర్వాత డార్లింగ్ బిగ్ స్క్రీన్ మీద కనిపించ బోతున్నాడు.

ఈ సినిమా సంక్రాంతికే రిలీజ్ అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా వేశారు.ఇక ఎట్టకేలకు అన్ని అడ్డంకులను దాటుకుని ఈ సినిమా మార్చి 11న రిలీజ్ కానున్నట్టు ఇటీవలే ప్రకటించారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి ప్రమోషన్స్ పరంగా వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులకు ఈ సినిమాను మరింత దగ్గర చేసింది.అందులోనే ఇది డిఫెరెంట్ లవ్ స్టోరీ కావడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

Advertisement

ఈ సినిమా 1970 కాలం నటి పీరియాడిక్ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమ కథ.

దీనిని యూరప్ లోని హెరిటేజ్ అందాల నేపథ్యంలో డైరెక్టర్ భారీ విజువల్ వండర్ గా తెరకెక్కించాడు.మార్చి 10న అంటే ఈ రోజు పలు దేశాల్లో ప్రీమియర్ షోలు పడబోతున్న నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ సినిమా నుండి ఒక పోస్టర్ ను విడుదల చేసారు.ఇది అందరిని ఆకట్టు కుంటుంది.

మరికొద్ది గంటల్లోనే విడుదల అవుతున్న ఈ సినిమా ప్రీమియర్స్ స్టార్ట్ కానున్న నేపథ్యంలో టీమ్ నుండి ఒక పర్ఫెక్ట్ పోస్టర్ రిలీజ్ అయ్యింది.ఈ పోస్టర్ లో ప్రభాస్, పూజా హెగ్డే ఇద్దరు ఒకరి కౌగిలిలో ఒకరు ఉండి నవ్వులు చిందిస్తున్నారు.

ఈ పోస్టర్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంటుంది.ఈ సినిమా ప్రేమకి విధికి మధ్య సాగిన కథ అని ఇప్పటికే తెలుస్తుంది.

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో పామిస్ట్ గా నటించాడు.ఈ మూవీ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే.

Advertisement