ష‌ర్మిల పార్టీలో కొత్త స‌మ‌స్య‌లు.. వ‌చ్చే వారే లేరా..?

తెలంగాణ‌లో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చిన ష‌ర్మిల‌కు ఆదిలోనే ఎన్నో స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి.

ఏపీలోత‌న అన్న పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డంలో కీల‌కంగా ప‌నిచేసిన ష‌ర్మిల ఇప్పుడు తెలంగాణలో మాత్రం నానా ఇబ్బందులు ప‌డుతోంది.

పార్టీని ముందుకు న‌డిపించ‌లేక‌, ఇత‌రుల‌ను చేర్చుకోలేక ఎన్నో అవ‌స్థ‌లు ఎదుర‌వుతున్నాయి ఆమెకు.ఇక ఆమె పార్టీలో క‌నీసం ముఖ ప‌రిచ‌యం అవ‌స‌రం లేని లీడ‌ర్ ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా లేక‌పోవ‌డం పెద్ద మైన‌స్ అనే చెప్పాలి.

అయితే ఆమెకు నిన్న మొన్న‌టి వ‌ర‌కు అంతో ఇంతో చేదోడు వాదోడుగా ఉండే ఇందిరా శోభ‌న్ రాజీనామా ఆమెకు పెద్ద దెబ్బే అని చెప్పాలి.ఎందుకంటే ఇంత‌కుముందు కూడా ఇలాగే చాలామంది నేత‌లు రాజీనామా చేసినా అది పెద్ద ప్ర‌భావం చూప‌లేదు గానీ ఇందిరా శోభ‌న్ రాజీనామా మాత్రం చాలానే ఎఫెక్ట్ చూపిస్తోంది.

ఎందుకంటే పార్టీని న‌డిపిస్తున్న ష‌ర్మిల ప్ర‌తి నిర్ణ‌యం వెన‌క ఆమెనే ఉన్నారు.ఎన్నో కీల‌క‌మైన నిర్ణ‌యాలు తీసుకుని, ష‌ర్మిల‌కు సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇస్తూ చాలా యాక్టివ్‌గా ఒక‌ర‌కంగా చెప్పాలంటే ష‌ర్మిల త‌ర్వాత ఆమెనే అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రించారు.

New Issues In Sharmilas Party Arent They Coming, Sharmila, Politics, Indira Shob
Advertisement
New Issues In Sharmilas Party Arent They Coming, Sharmila, Politics, Indira Shob

ఇక అలాంటి నాయ‌కురాలు రాజీనామా చేయ‌డంతో ష‌ర్మిల పార్టీలో ఇమ‌డ‌డం చాలా క‌ష్ట‌మ‌నే భావ‌న‌కు వ‌స్తున్నారు ఆమె అభిమానులు.ష‌ర్మిల పార్టీకి తెలంగాణ‌లో మ‌నుగ‌డ క‌ష్ట‌మే అని అందులోకి వెళ్తే రాజ‌కీయ భ‌విష్య‌త్ ఉండ‌దనే భ‌యంతో యూత్ కూడా అందులో చేరేందుకు పెద్ద‌గా ఇంట్రెస్ట్ చూపించ‌ట్లేదు.ఇక ష‌ర్మిల పార్టీకి అస‌లు ఎవ‌రైనా లీడ‌ర్ ఉంటారా అనేది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారిపోయింది.

ఈ స‌మ‌స్య ష‌ర్మిల‌ను బాగానే వెంటాడుతోంది.ఇక రాబోయే కాలంలో ష‌ర్మిల పార్టీ ప‌రిస్థితి ఏంటో ఎవ‌రికీ అర్థం కాకుండా ఉంది.

మ‌రి ష‌ర్మిల పార్టీని ఎలా ముందుకు న‌డిపిస్తారో చూడాలి.

Ladies Finger, Reduce Overweight, Overweight, Weight Loss Tips, Benefits Of Ladies Finger For Heal
Advertisement

తాజా వార్తలు