Transparent Smart Phone: ఇదిగో భవిష్యత్తులో ఇలాంటి స్మార్ట్ ఫోన్ చూస్తారు... డిజైన్ చూస్తే మతిపోతుంది మీకు?

టెక్నాలజీ ఎప్పుడికి ఎలా మారుతుందో ఎవరూ అంచనా వేయలేరు.అలా అంచనా వేయగలిగేవారే ఈరోజు కార్పొరేట్ దిగ్గజాలుగా ప్రపంచం ముందు వెలుగొందుతున్నారు.

స్మార్ట్ యుగంలో స్మార్ట్ గా ఆలోచించకపోతే రేసులో దూసుకెళ్లడం కష్టం.ప్రపంచమే ఓ కుగ్రామం అయిపోతున్నవేళ ప్రతిఒక్కరూ స్మార్ట్ ఫోన్స్ కలిగి వున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 90 శాతం మందికి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయని ఓ సర్వే.దాని బట్టే అర్ధం అవుతుంది దాని ప్రాముఖ్యత.

ఇకపోతే ఇప్పటికే మార్కెట్లో ఎన్నో రకాల అప్డేటెడ్ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.అలాగే రానున్న కాలంలో స్మార్ట్ ఫోన్స్ ఎలా వుంటాయో ఊహించడం కూడా కష్టమే.

Advertisement

భవిష్యత్తులో ఎలాంటి స్మార్ట్ ఫోన్స్ రానున్నాయి, వాటి డిజైన్లు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాన్ని ఊహించడం మనకి కష్టమైనవేళ ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇక్కడి ట్విట్టర్ హేండిల్ లో విన్న వీడియో చూడండి.

మతిపోతోంది కదూ.జస్ట్ స్క్రీన్ మాత్రమే కనిపిస్తుంది.చేతిలో ఏదో గాజుపలకను పట్టుకున్నట్లు దానిపై నక్షత్రాల్లాగా మెరిసే యాప్స్ కనిపిస్తున్నాయి.

ఇది కంప్లీట్ ట్రాన్స్ పరేంట్ డిజైన్ అని అర్ధం అవుతోంది.దీని ఆపరేటింగ్ సిస్టమ్ MIUIలా కనిపిస్తుంది.అయితే షియోమీ అలాంటి కాన్సెప్ట్ ఫోన్లో పనిచేస్తుందా లేదా అనేది మాత్రం ఇంకా స్పష్టం చేయలేదు.

ట్రాన్స్ పరేంట్ ఫోన్ డిజైన్ చేయడం ఇది మొదటిసారి కాదు.ఇంతకు ముందు మనం నథింగ్ ఫోన్ చూశాం.అయితే ఇక్కడ వీడియోలో చూస్తుంది దానికంటే భిన్నంగా వుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 8, బుధవారం 2023

ఈ ట్రాన్స్ పరేంట్ డిజైన్ స్మార్ట్ ఫోన్ లో బ్యాటరీ కూడా కనబడట్లేదు.దాన్ని వైర్ లెస్ ఛార్జర్ కూడా ట్రాన్స్ పరేంట్ గా ఉన్నట్లు వీడియోలో చూడవచ్చు.

Advertisement

తాజా వార్తలు