మ‌రో నాలుగు రోజుల్లో కొత్త జిల్లాలు ! ముమూర్తం ఫిక్స్ !

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు మొన్న‌టి దాకా ఎంత ర‌చ్చ చేసిందో విధిత‌మే.

ఎట్ట‌కేల‌కు జిల్లాల వివాదం త‌రువాత సీఎం జ‌గ‌న్ ఉన్న‌త‌ స్థాయి స‌మీక్ష నిర్వ‌హించి క్లారిటి ఇచ్చేశారు.

మ‌రో నాలుగు రోజుల్లో కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి.పాత 13 జిల్లాలు ఇక నుంచి 26 జిల్లాలుగా ఏర్ప‌డ‌నున్నాయి.

ఇందుకు ముహూర్తం కూడా ఖ‌రారు చేసిన‌ట్టు టాక్‌.ఏప్రిల్ 4వ తేదీ నుంచి కొత్త జిల్లాల అవ‌త‌ర‌ణ కానుంది.

దీనికి సంబంధించిన ఏర్పాట్ల విష‌యం ఇప్ప‌టికే అధికారుల‌కు ఆదేశాలు కూడా వ‌చ్చాయ‌ట‌.అలాగే కొత్త జిల్లాల‌కు వ‌ర్చువ‌ల్‌గా స‌మావేశ‌మైన మంత్రి వ‌ర్గం కూడా ఇందుకు ఆమోదం తెలిపింది.

Advertisement

మొత్తంగా ఏపీని 26 జిల్లాలుగా విభ‌జిస్తున్నారు.వీటికి తోడు మ‌రో 22 రెవెన్యూ డివిజ‌న్ల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు.

మ‌రోవైపు కొత్త‌జిల్లాల అంశంపై దాదాపు 11వేల‌కు పైగా వినతులు, ఫిర్యాదులు వ‌చ్చాయ‌ట‌.ఇందులో పెద్ద ఎత్తున ఉద్య‌మాలు జ‌రిగిన జిల్లాలు కూడా ఉండ‌డం విశేషం.

వీటిపై జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్న‌ది ? అనేది మాత్రం సస్పెన్స్‌గానే ఉంది.మొత్తంగా రాజ‌కీయ డిమాండ్ల‌తోపాటు ప్ర‌జా విన‌తులు క్షుణ్ణంగా ప‌రిశీలించి సానుకూల నిర్ణ‌యం తీసుకున్నార‌ని టాక్‌.

మ‌రోవైపు కొత్త క‌లెక్ట‌రేట్లు, ఎస్పీ ఆఫీసుల‌కు భ‌వ‌నాలను కూడా ఎంపిక చేశార‌ట‌.

మీరు 11 వ తారీఖున జన్మించారా....అయితే మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?

విశాఖ జిల్లాలోని అల్లూరు సీతారామ‌రాజు జిల్లాకు పాడేరు ఐటీడీఏ భ‌వ‌నం కొత్త క‌లెక్ట‌రేట్‌గా ఉంటుంద‌ట‌.మ‌న్యం జిల్లాకు పార్వ‌తీ పురంలోని ఐటీడీఏ బిల్డింగ్‌ను తీసుకున్నార‌ట‌.ఇక విజ‌య‌వాడ జిల్లాకు స‌బ్ క‌లెక్ట‌ర్ కార్యాల‌యాన్ని క‌లెక్ట‌ర్ ఆఫీస్‌కు వినియోగించ‌నున్నార‌ట‌.

Advertisement

అలాగే బాప‌ట్ల జిల్లాకు మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి కేంద్రం భ‌వ‌నం క‌లెక్ట‌రేట్‌గా మార‌నుంద‌ట‌.మొత్తానికి ఈ ఉగాది నుంచి కొత్త జిల్లాలు వ‌స్తాయ‌నుకుంటే మ‌రో రెండు రోజుల త‌రువాత మంచి ముహూర్తం చేసుకుని ఏర్పాటు చేయ‌నున్నారు.

దీంతో ఏపీ రాష్ట్ర జిల్లాల స్వ‌రూపం మొత్తం మారే వీలుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

తాజా వార్తలు