మల్లెతోటల సాగులో నూతన మార్పులు.. యాజమాన్య పద్ధతులు..!

మల్లె పువ్వులలో జాజిమల్లె, కాగడమల్లె, గుండుమల్లె అనే మూడు రకాలు ఉన్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ మల్లె తోటలను సాగు చేసి అధిక దిగుబడి పొందవచ్చు.

గుండు మల్లెలు( jasmine ) మార్చి నుండి సెప్టెంబర్ వరకు పూల దిగుబడి వస్తుంది.జాజిమల్లెలు మార్చి నుండి అక్టోబర్ వరకు పూల దిగుబడి వస్తుంది.

కాగడ మల్లెలు జూన్ నుండి ఫిబ్రవరి వరకు పూల దిగుబడి( Flower yield ) వస్తుంది.ఏడాది పొడుగునా మార్కెట్లో మల్లెపూలకు విపరీతంగా డిమాండ్ ఉండడంతో సాధారణ పద్ధతులలో కాకుండా కొన్ని శాస్త్రీయ పద్ధతులు పాటించి అధిక దిగుబడి పొందవచ్చు.

మల్లె తోటలు వేసిన మూడు సంవత్సరాల నుండి పూలు చేతికి రావడం ప్రారంభమై దాదాపు 15 సంవత్సరాల వరకు పూల దిగుబడి పొందవచ్చు.ఆ తరువాత క్రమంగా పూల దిగుబడి తగ్గుతుంది.మల్లె తోటలలో అధిక దిగుబడి కోసం కొమ్మల కత్తిరింపులు( Pruning of branches ) కీలకం.

Advertisement

ఇందుకోసం ముందుగా నవంబర్ నుండి తోటలకు నీరు పెట్టకుండా వాడ బెట్టి ఆకులు రాలే విధంగా చేయాలి.జనవరి నెల ముగిసే లోపు 90 శాతం కంటే ఎక్కువ ఆకులు రాలిపోతాయి.

సమయంలో కొమ్మలను దగ్గరగా చేసి తాడుతో కట్టాక మల్లె తోటలలో మేకల మందలను వదలాలి.ఇలా చేస్తే మొక్కలకు ఉన్న ఆకులన్నీ రాలిపోతాయి.

ఇక ఐదు సంవత్సరాల లోపు వయసు ఉన్న మొక్కల కొమ్మలు మూడు అడుగుల మేర ఉంచి పైభాగాలను కత్తిరించేయాలి.అలాగే బలహీనంగా ఉన్న ఎండు కొమ్ములను కూడా పూర్తిగా తొలగించాలి.తరువాత తోటకు నీటి తడి అందించాలి.

నేల ఆరిన తర్వాత చెట్టు మొదల చుట్టూ 30 సెంటీమీటర్లు వదిలి మిగిలిన నేలను 15cm లోతుకు తవ్వి వారం రోజుల వరకు ఎండనివ్వాలి.పూలు పూసే వరకు కనీసం నాలుగు సార్లు తవ్వకాలు చేయాలి.

పూలు కోసిన తర్వాత చెట్లు కాస్త వాడేలా చేసి ఆ తర్వాత నీటిని పారించాలి.పూత సమయంలో నీటి ఎద్దడి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

Advertisement

నేల స్వభావాన్ని బట్టి నీటి తడులు అందిస్తే మంచి ఆదాయం పొందవచ్చు.

తాజా వార్తలు