కొత్తగా కారు కొన్నవారు అక్టోబర్ 1 నుంచి వచ్చే ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి!

కారు ఎవరికవసరం లేదు! ఈ రోజుల్లో ఫ్యామిలీతో అలా సరదాగా లాంగ్ డ్రైవ్ వెళ్ళడానికి అందరూ కారులోనే వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు.

ఎందుకంటే సౌకర్యం వంతం పైగా ఈ రణగొణధ్వనులకు దూరంగా ఉండొచ్చు.

అందుకే సామాన్యులు కూడా ఇప్పుడు తమ ఉన్నంతలో కొత్త కారును కొనుగోలు చేయాలని అనుకున్న పరిస్థితి.ఈ క్రమంలో చాలామంది వినియోగదారులు సేఫ్టీ ఫీచర్లకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు.

ఈ నేపథ్యంలో కార్ల భద్రతా ప్రమాణాలను తనిఖీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం( Central Govt ) కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టబోతోందనే విషయాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది.అక్టోబర్ 1 నుంచి, ఇది దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.

దేశంలో కార్ల భద్రతా ప్రమాణాలను తనిఖీ చేసేందుకు భారత ప్రభుత్వం భారత్ ఎన్‌క్యాప్ (Bharat- NCAP - భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్)ను ఒకదానిని ప్రవేశ పెట్టనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.ఇది దేశంలోని కార్లకు సేఫ్టీ రేటింగ్( Safety rating ) ఇవ్వనుంది.ఈ సిస్టమ్‌ ద్వారా ప్రస్తుత కార్ల కంటే భవిష్యత్తులో రానున్న కార్లు మరిన్ని భద్రతా ప్రమాణాలతో వచ్చే అవకాశం కలదు.

Advertisement

భారత్‌ NCAP అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.భారత్ NCAP అమల్లోకి వస్తే కొత్త కారు కొనుగోలుదారులు తమ భద్రత గురించి మరింత అవగాహన కలిగి ఉండే అవకాశం జనాలకు ఉంటుంది.భద్రతకు సంబంధించి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని భారత్ NCAP నిబంధనలు రూపొందించబడ్డాయి.https://telugustop.com/wp-content/uploads/2023/07/New-car-buyers-good-news-October-new-rules-latest-news-Safety-rating.jpg

ఈ నేపథ్యంలో పెద్దలు, పిల్లల రక్షణ, పాదచారులకు అనుకూలమైన డిజైన్, కారు సేఫ్టీ ఫీచర్స్‌ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.గ్లోబల్ NCAP మాదిరిగానే వాహనాల్లో భద్రతా ప్రమాణాలను పరీక్షించి 1 నుంచి 5 స్టార్ రేటింగ్‌ను ఇస్తుందని కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా ప్రకటించింది.క్రాష్‌ టెస్ట్‌, సేఫ్టీ రేటింగ్‌లు AIS-197 కి లోబడి ఉంటాయి.

ఆటోమేకర్లు తమ కార్ల కోసం స్వచ్ఛందంగా భారత్ NCAP పరీక్ష చేయించుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.దేశీయ, విదేశీ తయారీ పెట్రోల్, డీజిల్, CNG, ఎలక్ట్రిక్ వాహనాలు, డ్రైవర్ సీటుతో సహా 8 సీట్లు, 3.5 టన్నుల కంటే తక్కువ బరువున్న కార్లు భారత్ NCAP పరీక్ష చేయించుకోవాలి.టాటా మోటార్స్, మారుతీ సుజుకి, టయోటా( Toyota ), స్కోడా, కియా, మహీంద్రాతో సహా కంపెనీలు భారత్ NCAPని స్వాగతించడం కొసమెరుపు.

వైరల్ వీడియో : రేవ్ పార్టీలో యాక్టర్ రోహిణి నిజంగానే దొరికిందా లేక ప్రాంకా..?
Advertisement

తాజా వార్తలు