కేటీఆర్ స్పందనకు ఫిదా అయిన నెటిజనులు !

ఏ పోటీలోనైనా విజయం అపజయం మామూలే ఒకరు ఓడితేనే మరోకరు గెలుస్తారు.

అయితే ఓటమిని సానుకూలం గా తీసుకునే పరిణితి మాత్రం అందరికీ ఉండదు.

తాము ఓడిపోయినా తమదే నైతిక విజయం అని లేదా ప్రత్యర్థులు ఏవో అక్రమాలు చేసి గెలిచారని ఇందులో ఏదో మోసం ఉందంటూ పెడార్థాలు తీసే ప్రయత్నాలు చేస్తారు.అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో( Telangana Assembly Elections ) పరాజయం పాలయిన తర్వాత బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు( KTR ) ట్విట్టర్ వేదికగా స్పందించిన విధానం చాలామంది నేటిజనులను ఆకట్టుకుంది.

ఈసారి గురి లక్ష్యానికి చేరలేదని, ఫలితాలపై నిరాశ లేదని, ప్రజాస్పందన గౌరవిస్తున్నామని లోటుపాట్లను సరిచేసుకుంటూ మరింత ఉత్సాహంగా సిద్ధమవుతామని చెబుతూనే విజయం సాధించిన కాంగ్రెస్ను ఉద్దేశించి శుభాకాంక్షలు చెప్పిన కేటీఆర్ మీకు అంతా శుభం కలగాలని ట్వీట్ చేశారు.

దీనిపై ఫిల్మ్ సెలబ్రెటీల దగ్గర్నుంచి సామాన్య పౌరుల వరకూ కేటీఆర్ అభినందిస్తున్నారు.యాంకర్ అనసూయ( Anasuya ) అయితే మీ నాయకత్వం లో అభివృద్ధి చెందిన తెలంగాణ తో ప్రేమలో పడ్డానని, మీరు ప్రతిపక్షంలో ఉన్నా మీ స్థాయి నాయకత్వాన్ని చూపిస్తారని ఆశిస్తున్నాను అంటూ ట్విట్ చేయగా ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) అయితే ఓటమిని ఇంత హుందాగా తీసుకున్న రాజకీయ నాయకులను ఇంతవరకూ చూడలేదని ఇలాంటి ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యమే కావాలంటూ కేటీఆర్ ని అభినందించారు.

Advertisement

హీరో సందీప్ కిషన్( Sandeep Kishan ) అయితే ఓడినా గెలిచినా మేము ఎప్పటికీ మీ అభిమానులమే అంటూ స్పందించారు.వీళ్లే కాకుండా ఇంకా చాలామంది కేటీఆర్ పరిణితి చెందిన నాయకత్వ లక్షణాలను ప్రశంసిస్తున్నారు.ఓటమిని హుందాక స్వీకరించారని లోటుపాట్లను సవరించుకొని మరింత బలంగా రెడీ అవ్వాలనే సానుకూల ఆలోచన దృక్పథం ఒక గొప్ప లక్షణమని , అది కేటీఆర్ కి ఉందంటూ కేటీఆర్ ను ఆకాశానికి ఎత్తివేస్తున్నారు.

అనేక శాఖలకు మంత్రిగా చేసిన కేటీఆర్ పాలనలో చాలా మంచి పేరు తెచ్చుకున్నారు.ట్విట్టర్లో పోస్ట్ చేసే సమస్యలకు వెనువెంటనే స్పందించే నేతగా పేరు తెచ్చుకున్న ఆయన కాబోయే ముఖ్యమంత్రిగా కూడా చాలామంది అబిప్రాయ పడ్డారు.

మరి ప్రతిపక్ష నాయకుడి ఆ ఆయన ఏ స్తాయిలో పని చేస్తారో చూడాలి .

సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?
Advertisement

తాజా వార్తలు