Hansika: భర్తతో కాపురం చేస్తున్నావా లేదా.. హన్సిక తిరుగుళ్లపై నెటిజన్స్ ట్రోల్స్?

సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలు ఇట్టే వైరల్ అవుతూ ఉంటాయి.

వాళ్ళు ఏం చేసినా కూడా జనాలు వాళ్లపై బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు.

నిత్యం వారిని ఒక కంట కనిపెడుతూ ఉంటారు.అంతేకాకుండా వారిని వార్తల్లోకి లాగుతూ ఉంటారు.

అయితే తాజాగా హన్సిక( Hansika ) విషయంలో కూడా జనాలు తల దూర్చి ఆమెపై బాగా ట్రోల్స్ చేస్తున్నారు.ఇంతకు అసలేం జరిగిందంటే.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన వైట్ బ్యూటీ హన్సిక గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.సినీ ఇండస్ట్రీకి బాలనటిగా అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత దేశముదురు సినిమాతో( Desamuduru ) హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

Advertisement

ఈ సినిమాలో హీరోయిన్ గా తన నటనతో మంచి సక్సెస్ అందుకుంది.ఆ తర్వాత వరుసగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, రామ్ లతో పాటు పలువురు స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించింది.

అలా తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ సినిమాలలో కూడా చేసింది.గత ఏడాది ఒక బిజినెస్ మాన్ ను ప్రేమ పెళ్లి( Love Marriage ) చేసుకున్న సంగతి తెలిసిందే.

కానీ అతడికి హన్సిక రెండవ భార్య. ఆయన మొదటి భార్య ఎవరో కాదు హన్సిక ఫ్రెండే.

వారిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకోవడంతో.హన్సిక తన ఫ్రెండ్ భర్తను వివాహం చేసుకుంది.

ఆ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా.. చైనా సూపర్‌మార్కెట్‌లోనూ ఆయన పాటలు.. వీడియో వైరల్..
మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?

ఆ సమయంలో చాలామంది ఆమెపై ట్రోల్స్ చేశారు.

Advertisement

కానీ అవేవీ పట్టించుకోకుండా హన్సిక పెళ్లి లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తుంది.తన పెళ్లి జరిగి సంవత్సరం కూడా కావొచ్చింది.కానీ ఇప్పటివరకు గుడ్ న్యూస్ కూడా చెప్పనేలేదు ఈ బ్యూటీ.

ఇక సినీ ఇండస్ట్రీకి సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అడుగు పెట్టేసింది.ఇక సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది.

ఇక పెళ్లి అయినప్పటినుంచి తన భర్తతో దిగిన ఫోటోలను, వీడియోలను బాగా పంచుకుంటూ ఉంటుంది.

ఇక పెళ్లయ్యాక కూడా భర్త( Hansika Husband ) సపోర్ట్ తో బాగా గ్లామర్ షో చేస్తుంది.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ అందాలను బయటపెడుతూ రచ్చ చేస్తుంది.ఇక భర్త మంచి ఫ్రీడం ఇవ్వటంతో అస్సలు తగ్గట్లేదు ఈ హాట్ బ్యూటీ.

అయితే ఈమధ్య బాగా దేశాలు చుట్టేస్తుంది.అక్కడ దిగిన ఫోటోలు కూడా బాగా పంచుకుంటుంది.

తను పంచుకున్న ఫోటోలో తన భర్త ఎక్కడ కూడా కనిపించడం లేదు.

తను మాత్రమే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది.దీంతో తను వరుస ఫోటోలు పంచుకోవడంతో జనాలు ఆమెపై బాగా ట్రోల్స్ చేస్తున్నారు.ఇంతకీ భర్తతో కాపురం చేస్తున్నావా లేదా అంటూ.ఎప్పుడు దేశాలే తిరుగుతున్నావు.

కాస్త నీ భర్తను పట్టించుకో అంటూ కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం తను మరో వెకేషన్ లో ఉండగా దానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

తాజా వార్తలు