రాజేంద్రప్రసాద్ తీరుపై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్.... హాస్యం, అపహాస్యానికి తేడా తెలీదా అంటూ! 

సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్( Rajendra Prasad ) ప్రస్తుతం వివాదంలో నిలిచారు.

ఈయన నటించిన రాబిన్ హుడ్ ( Robin Hood ) సినిమా ఈ నెల 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా ఇటీవల ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు ఇక ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా వేదికపై రాజేంద్రప్రసాద్ ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్( David Warner ) గురించి చేస్తున్న వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో విమర్శలకు కారణమవుతున్నాయి.వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్( Nithin ) శ్రీ లీల ( Sreeleela ) హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో క్రికెటర్ డేవిడ్ వార్నర్ నటించిన విషయం తెలిసిందే.

Netizens Fire On Rajendra Prasad Comments Over On David Warner Details, David Wa

ఇక ఈ సినిమా ట్రైలర్ లంచ్ కార్యక్రమంలో భాగంగా డేవిడ్ వార్నర్ కూడా హాజరయ్యారు .అయితే వేదిక పైకి వెళ్ళిన రాజేంద్రప్రసాద్ డేవిడ్ వార్నర్ గురించి మాట్లాడుతూ.రేయ్ వార్నరు వచ్చి క్రికెట్ ఆడవయ్యా అంటే పుష్ప డైలాగులు వేస్తావా నువ్వు మామూలోడివి కాదు పెద్ద దొంగ ము** కొడుకువురా రెేయ్ వార్నర్ అంటూ మాట్లాడారు.

అయితే ఈయన సరదాగా మాట్లాడారని తెలుస్తుంది అయితే ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Netizens Fire On Rajendra Prasad Comments Over On David Warner Details, David Wa
Advertisement
Netizens Fire On Rajendra Prasad Comments Over On David Warner Details, David Wa

డేవిడ్ వార్నర్ ప్రముఖ ఆస్ట్రేలియన్ క్రికెటర్ అనే సంగతి మనకు తెలిసిందే.ఆయనకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు.అలాంటి ఒక గొప్ప క్రికెటర్ గురించి రాజేంద్రప్రసాద్ ఇలా బూతులు మాట్లాడటంతో అభిమానులు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు.

సరదాగా మాట్లాడిన హాస్యానికి , అపహాస్యానికి తేడా తెలియకుండా మీరు మాట్లాడారా అంటూ కొందరు విమర్శలు చేయగా మరికొందరు తాగి సినిమా వేడుకలకు వస్తే ఇలాగే ఉంటుంది అంటూ కూడా రాజేంద్రప్రసాద్ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.అయితే ఇలా తన గురించి వస్తున్నటువంటి విమర్శలపై రాజేంద్రప్రసాద్ ఎలా రియాక్ట్ అవుతారో తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు