నీవల్ల మేము చస్తే ఎవరిది ఆ బాధ్యత.. శ్రీలీలపై ఫైరవుతున్న నెటిజన్స్?

అప్పుడప్పుడు అభిమానులు తమకిష్టమైన సెలబ్రిటీలపై ఫైర్ అవుతూ ఉంటారు.నిజానికి ఆది ఫైర్ అని కాదు ఒక రకంగా అది ప్రేమ అని చెప్పవచ్చు.

ముఖ్యంగా అబ్బాయిలు మాత్రం తమకు నచ్చిన హీరోయిన్ల పై మాత్రం ప్రేమతో కూడిన కోపాన్ని చూపిస్తూ ఉంటారు.వాళ్ళు అందంగా తయారైన, ఎవరిపైనైనా వాళ్లు ప్రేమ చూపించిన కూడా అసలు తట్టుకోలేకపోతుంటారు.

అయితే తాజాగా శ్రీ లీల అభిమాని కూడా శ్రీ లీలపై బాగా ఫైర్ అయ్యాడు.ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

ఆ మధ్యనే విడుదలైన ధమాకా సినిమాతో శ్రీ లీల రేంజ్ ఎంతలా మారిపోయిందో చూసాం.ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది బ్యూటీగా మారింది ఈ ముద్దుగుమ్మ.

Advertisement

చిన్నవయసులో నటిగా అడుగుపెట్టిన శ్రీలీలకు అతి తక్కువ సమయంలో మంచి పేరు రావడం అనేది సామాన్య విషయం కాదు అని చెప్పాలి.కేవలం నటన పరంగా కాకుండా డాన్స్ పరంగా కూడా అందరి చూపులను తన వైపుకు తిప్పుకుంది.

ముఖ్యంగా తన అందాలతో, తన నవ్వుతో కుర్రాళ్ళ గుండెల్లో బాణం గుచ్చేసింది.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియా కూడా ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తుంది.

శ్రీ లీల తొలిసారిగా 2019లో ముద్దు అనే కన్నడ సినిమాతో నటిగా అడుగు పెట్టింది.అదే ఏడాది భరతే అనే కన్నడ సినిమాలో నటించింది.

దీంతో కన్నడలో తనకు మంచి గుర్తింపు వచ్చింది.ఇక 2021 లో పెళ్లి సందD సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయింది.

తెలంగాణ అని చెప్పుకునే విజయశాంతి నిజంగా ఎక్కడ పుట్టి, పెరిగింది

ఈ సినిమాలో తన నటనతో మంచి మార్కులు సంపాదించుకుంది.తన డాన్స్ తో మాత్రం బాగా అదరగొట్టింది.

Advertisement

అలా తెలుగు ప్రేక్షకులతో మంచి పరిచయం పెంచుకుంది.ఇక గత ఏడాది రవితేజ నటించిన ధమాకా సినిమాలో హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకోవడంతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మరింత పెరిగిపోయింది.ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది.దీంతో ధమాకా ఎఫెక్ట్ తో ఈ బ్యూటీపై తెలుగు దర్శకనిర్మాతలు కన్ను వేశారు.

అప్పటికే పలువురు దర్శకులు ఈమెతో రెండు మూడు సినిమాలు ఫిక్స్ చేశారు.ప్రస్తుతం అవి షూటింగ్ బిజీలో ఉన్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ బ్యూటీ ఖాళీ సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలో బాగా సమయం గడుపుతుంది.ధమాకా తర్వాత ఈ ముద్దుగుమ్మకు ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది.

ఇప్పుడు కుర్రాళ్ల క్రష్ గా ఈ ముద్దుగుమ్మనే ఉంది.దీంతో ఈ ముద్దుగుమ్మ తన ఫాలోవర్స్ కోసం ఏమాత్రం తగ్గట్లేదు.

వారి కోసం గ్లామర్ షో చేస్తూ ఉంటుంది.నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను, సినిమా అప్డేట్లను పంచుకుంటూ ఉంటుంది.

చూడటానికి చాలా అందంగా ఉండే ఈ ముద్దుగుమ్మకు కుర్రాళ్ళు ఫిదా అవుతూ ఉంటారు.

తన అందాన్ని చూసి మురిసిపోతూ ఉంటారు.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్స్టా వేదికగా ఒక వీడియో పంచుకుంది శ్రీ లీల.అందులో ఈ ముద్దుగుమ్మ పండగ సందర్భంగా చీర కట్టులో కనిపించింది.దీంతో తన అందాలతో మరింత పిచ్చెక్కించింది.

ఇక ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా తన ఫాలోవర్స్ ఆ వీడియోని చూసి ఫిదా అవుతున్నారు.అందంగా ఉన్నావంటూ కామెంట్స్ పెడుతున్నారు.

అభిమాని మాత్రం ఇంత అందం తట్టుకోలేక చనిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటూ సరదాగా తనపై కోపపడ్డాడు.ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.