Shivani Rajasekhar : శివాని రాజశేఖర్ చిన్నప్పుడు అంతలా ప్రవర్తించేదా.. మరీ ఇప్పుడేంటి ఇలా ఈ మార్పు?

మామూలుగా మనుషులకు మార్పు అనేది సహజం.వయసు పెరుగుతున్న కొద్ది, ఆలోచనలు పెరుగుతున్న కొద్దీ వాళ్లలో మార్పులు వస్తూ ఉంటాయి.

ఒకప్పుడు అతిగా ప్రవర్తించిన వాళ్ళు ఇప్పుడు అణిగిమనిగి ఉంటారు.ఇక అప్పుడు అణిగిమని ఉన్న వాళ్ళు ఇప్పుడు అతిగా ప్రవర్తిస్తూ ఉంటారు.

ఇదంతా కామన్ అని చెప్పాలి.అయితే సినీ ఇండస్ట్రీ( Film Industry )కి చెందిన సెలబ్రెటీలలో కూడా సందర్భం బట్టి మార్పు వస్తూ ఉంటుంది.

అలా కాకుండా కావాలని మార్పులు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉంటారు.అయితే ఇదంతా పక్కన పెడితే శివాని రాజశేఖర్ కు కూడా చిన్నప్పుడు చాలా అతిగా ప్రవర్తించేదని ఒక న్యూస్ వైరల్ అవుతుంది.

Advertisement

అయితే అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒకప్పటి స్టార్ హీరో రాజశేఖర్ కూతురు, టాలీవుడ్ హీరోయిన్ శివాని రాజశేఖర్( Shivani Rajasekhar ) అందరికీ పరిచయం అని చెప్పాలి.తల్లిదండ్రుల సహాయంతో ఇండస్ట్రీకి అడుగుపెట్టి నటిగా ఒక పేరు అయితే సంపాదించుకుంది.చూడ్డానికి అంత అందగత్తె కాకపోయినా కూడా కాస్తో కూస్తో క్యూట్ గా కనిపిస్తూ ఉంటుంది.

సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.తను తొలిసారిగా 2 స్టేట్స్( 2 States ) అనే సినిమాతో సినీ ఇండస్ట్రీకి నటిగా అడుగుపెట్టింది.

అదే ఏడాది వివి స్టూడియోస్ అనే సినిమాతో తమిళ ఇండస్ట్రీలో కూడా పరిచయం అయింది.ఇక ఆ సినిమాలతో తనకు మంచి సక్సెస్ రావటంతో ఆ తర్వాత అద్భుతం, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ సినిమాలతో పాటు పలు తమిళ సినిమాలలో కూడా నటించింది.

కంటినిండా నిద్ర‌పోతే పొట్ట త‌గ్గుతుంద‌ట తెలుసా..

అంతేకాకుండా ఓటీటీ వేదికగా కూడా పలు సిరీస్ లు చేసింది.ఆహా నా పెళ్ళంట( Aha Naa Pelllanta ) అనే వెబ్ సిరీస్ కూడా చేసిన సంగతి తెలిసిందే.నటిగానే కాకుండా నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టింది.

Advertisement

ఇక ప్రస్తుతం స్టార్ హోదాకు రావటం కోసం బాగా ప్రయత్నిస్తుంది.కానీ అంత పెద్ద పెద్ద సినిమాలలో మాత్రం అవకాశాలు అందుకోవటం లేదు.

ఇక ఖాళీ సమయం దొరికితే సోషల్ మీడియాలో అడుగుపెట్టి బాగా సందడి చేస్తూ ఉంటుంది.ఈమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.

తనకు సంబంధించిన ఫోటోలను, సినిమా అప్డేట్లను తన ఫాలోవర్స్ కు బాగా పంచుకుంటూ ఉంటుంది.అప్పుడప్పుడు గ్లామర్ ఫోటోలను కూడా పంచుతూ షాక్ ఇస్తుంది.

ఇక తన ఫాలోవర్స్ తో కూడా సరదాగా ముచ్చట్లు పెడుతూ ఉంటుంది.

ఏమాత్రం మొహమాట పడకుండా పొట్టి పొట్టి బట్టలు వేసుకొని బాగా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటుంది.పైగా ఇంట్లో తల్లిదండ్రులు సపోర్ట్ ఉండటంతో గ్లామర్ షో చేయటంలో అస్సలు వెనుకాడటం లేదు.ఇక తన చెల్లె శివాత్మిక( Shivatmika ) కూడా ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతున్న సంగతి తెలిసింది.

ఇక ఈ అక్క చెల్లెలు ఇద్దరు ఇండస్ట్రీలో మరికొంత కాలం కొనసాగడం కోసం గ్లామర్ వైపు అడుగులు వేస్తూ సోషల్ మీడియాలో బాగా హీట్ పుట్టిస్తున్నారు.

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా శివాని ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫొటోస్ పంచుకుంది.అందులో తను పద్ధతిగా లంగా వోణి కట్టుకొని నిండు తెలుగుతనం ఉట్టి పడినట్లు కనిపించింది.ఇక ఆ ఫోటోలు సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవ్వడంతో తన ఫాన్స్ బాగా లైక్స్ కొడుతున్నారు.

ఓ నేటిజన్ మాత్రం.ఈ ఇద్దరు అక్క చెల్లెలు చిన్నప్పుడు చాలా ఈగో లాగా ప్రవర్తించేవారని విన్నాను కానీ ఇప్పుడు బాగానే దారిలోకి వచ్చారు కదా అంటూ కామెంట్ చేశారు.

అంటే చిన్నప్పుడు తల్లితండ్రులు స్టార్ హీరో హీరోయిన్స్ కాబట్టి వాళ్ళు అలా ప్రవర్తించారు ఏమో కానీ.ఇప్పుడు వాళ్ళు స్టార్ హోదా కోసం ప్రయత్నిస్తున్నారు కాబట్టి తమ ఈగోలను పక్కకు పెట్టేసినట్లు అర్థమవుతుంది.

తాజా వార్తలు