బిగ్ బాస్ షో సీజన్ 8లో తెలుగు వాళ్లకు అన్యాయం జరిగిందా.. వాళ్లకే ఛాన్స్ ఇచ్చారా?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్8 ( Bigg Boss season 8 )తాజాగా గ్రాండ్ గా ప్రారంభమై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.ఈ షోలో ఏకంగా 14 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అయితే బిగ్ బాస్ సీజన్8 లో తెలుగు వాళ్లకు ఒకింత అన్యాయం జరిగిందనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.14 కంటెస్టెంట్లలో ఆరుగురు ఇతర భాషల కంటెస్టెంట్లు కావడం హాట్ టాపిక్ అవుతోంది.బిగ్ బాస్ షో నిర్వాహకుల సెలక్షన్ ఇలా ఉందేంటి అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

కర్ణాటకకు చెందిన పృథ్వీరాజ్, ప్రేరణ, నిఖిల్, యష్మీ గౌడలను ఎంపిక చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.నైనిక, ఆదిత్య ఓం ( Nainika, Aditya Om )కూడా తెలుగు వారు కాదు.

వీళ్లు తెలుగు భాషను మాట్లాడే విషయంలో ఒకింత ఇబ్బంది పడుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.

ఇతర భాషలకు చెందిన కంటెస్టెంట్లకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల బిగ్ బాస్ షో రేటింగ్స్ పై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఈ కామెంట్లపై బిగ్ బాస్ నిర్వాహకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.మరోవైపు హౌస్ లో తొలిరోజే గొడవలు జరగడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

బిగ్ బాస్ అంటే గొడవలేనా అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ సీజన్ లో ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని కంటెస్టెంట్లకు ప్రాధాన్యత ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.బిగ్ బాస్ సీజన్8 రేటింగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.నాగార్జున మాత్రం ఈ షోను సక్సెస్ చేయడానికి తన వంతు కష్టపడుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

బిగ్ బాస్ షో సీజన్8 కూడా హిట్టైతే నాగార్జునకు కూడా మంచి పేరు వస్తుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.నాగ్ హోస్టింగ్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

వేషం కోసం వచ్చిన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్న కోడి రామకృష్ణ..?
Advertisement

తాజా వార్తలు