హిమజ గారు కళ్లు తిరుగుతాయండి.. అలా చెయ్యకండి.. డ్యాన్స్ పై కామెంట్స్!

హిమజ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని నటి.

కెరియర్ మొదట్లో బుల్లితెర నటిగా ఈమె తెలుగు బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటిస్తూ విపరీతంగా అభిమానులను సంపాదించుకున్నారు.

కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైన హిమజ అనంతరం పలు సీరియల్ లో నటించి బాగా పాపులారిటీ పొందారు.ఇదే పాపులారిటీ తో ఈమె బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు.

ఇక బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా వచ్చిన పాపులారిటీ తో హిమజ ఎంతో బిజీ బిజీగా గడుపుతున్నారు.బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో గుర్తింపు పొందిన ఈమె ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్నారు.

బిగ్ బాస్ తర్వాత బుల్లితెర సీరియల్స్ కి దూరమైనప్పటికీ వెండితెర పై పలు సినిమాలలో, ముఖ్యమైన పాత్రల్లో నటిస్తూ సందడి చేస్తున్నారు.అదే విధంగా పలు షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో కూడా హిమజ పాల్గొంటూ బిజీగా ఉన్నారు.

Advertisement
Netizens Are Comments On Bigg Boss Himaja Dance, Bigg Boss Himaja, Tollywood, Da

ఈ విధంగా వెండితెర పై పలు సినిమాలలో నటిస్తూ సందడి చేస్తున్న ఈమె సొంతంగా యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న విషయం తెలిసిందే.తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు.

ఈ విధంగా యూట్యూబ్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా తన సహనటి నటులతో కలిసి హిమజ పెద్ద ఎత్తున సందడి చేస్తుంటారు.ఈ క్రమంలోనే ఈమెకు సంబంధించిన నిత్యం ఏదో ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటుంది.

ఇలా సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న హిమజ సోషల్ మీడియా వేదికగా కూడా భారీగానే డబ్బు సంపాదిస్తునట్లు తెలుస్తోంది.ఇకపోతే తాజాగా ఈమె ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇందులో ఈమె ఒక చేయి కిందికి, మరొక చేయి పైకి పెట్టి చుట్టూ తిరుగుతుంది.

Netizens Are Comments On Bigg Boss Himaja Dance, Bigg Boss Himaja, Tollywood, Da
వైరల్ అవుతున్న ఎన్నారై జంట ఫైనాన్షియల్ ప్లాన్.. వారి సీక్రెట్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!

ఈ విధంగా హిమజ ఎంతో సరదాగా ఇలా తిరుగుతూ ఉన్న ఈ రీల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు హిమజ గారు కళ్ళు తిరిగి పడిపోతారండి.అలా చేయకండి అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement

మొత్తానికి హిమజ నిత్యం ఏదో ఒక డాన్స్ వీడియో లేదా రీల్స్, యూట్యూబ్ వీడియోల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.

తాజా వార్తలు