నెల్లూరు జిల్లా వైసీపీ నేతకు కత్తిపోట్లు..!!

గత కొద్ది రోజులుగా నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ వైసీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే.

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఆ తర్వాత పార్టీ అధినాయకత్వం అతనిపై చర్యలతో నెల్లూరు రాజకీయాలు హిట్ ఎక్కాయి.

ఈ క్రమంలో నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహరించిన తీరుపై గత కొద్ది రోజులుగా ఖండిస్తున్న సంగతి తెలిసిందే.పరిస్థితి ఇలా ఉంటే తాజాగా నెల్లూరులో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.

బారాషాహీద్ దర్గా దగ్గర రెండు వర్గాల మధ్య వాగ్వాదం ఘర్షణకీ  దారితీసింది.ఈ ఘర్షణలో వైసీపీ నేత సమీర్ కు కత్తిపోట్లు కావటంతో.

వెంటనే సమీర్ ను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు.బారాషాహీద్ దర్గా దగ్గర తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు భారీగా మోహరించారు.

Advertisement
ఇంట్లోనే సూపర్ సిల్కీ హెయిర్ ను పొందాలనుకుంటే ఇలా చేయండి!

తాజా వార్తలు