బాలయ్య టాక్ షోతో నా జీవితం నాశనం...80 లక్షలు పోగొట్టుకున్నా:  నెల్లూరు వాసి

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో బెట్టింగ్ యాప్స్ ( Betting Apps ) ప్రమోట్ చేస్తున్న వారిపై పెద్ద ఎత్తున కేసులో నమోదు అవుతున్న సంగతి తెలిసిందే.

ఈ వ్యవహారంలో సినిమా సెలబ్రిటీలు కూడా ఉండటం విశేషం ఇప్పటికే మియాపూర్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పలువురి పై కేసులు నమోదు అయ్యాయి.

ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎంతోమంది నాశనం చేసుకున్న వారు ఉన్నారు.అయితే బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోయిన వారు ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదించాలి అంటూ పోలీసులు తెలియజేశారు.

ఈ క్రమంలోనే బెట్టింగ్ యాప్స్ ద్వారా 80 లక్షల రూపాయలు పోగొట్టుకున్నటువంటి నెల్లూరు( Nellore ) కు చెందిన ఓ వ్యక్తి పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు.

Nellore Citizen Loss 80 Lacks To See Betting App In Balayya Un Stoppable Show De

ఇక ఈయన అక్కడ తన ఆవేదన మొత్తం బయటపెట్టారు.తాను మేస్త్రి పనులు చేసుకుంటూ ఉండేవాడిని.బాలకృష్ణ( Balakrishna ) హోస్టుగా వ్యవహరించిన అన్ స్టాపబుల్( Un Stoppable Show ) కార్యక్రమంలో ఫన్ 88 ( Fun 88 ) బెట్టింగ్ యాప్ యాడ్ చూశాను.అది చూసి తాను కూడా  గేమ్ ఆడటం మొదలుపెట్టానని నెల్లూరుకు చెందిన బాధితుడు ఈ వివరాలను బయటపెట్టారు.2023లో ఆడటం స్టార్ట్ చేశాను.మొదట్లో డబ్బులు పెడితే బాగా లాభాలు వచ్చాయని తెలిపారు.

Nellore Citizen Loss 80 Lacks To See Betting App In Balayya Un Stoppable Show De
Advertisement
Nellore Citizen Loss 80 Lacks To See Betting App In Balayya Un Stoppable Show De

అన్ స్టాపబుల్ షోలో బాలకృష్ణ ప్రభాస్ కి ఫన్ 88 బాక్స్ గిఫ్ట్ ఇస్తూ.ఇందులో చాలా గేమ్స్ ఉంటాయ్ ఆడండి గిఫ్ట్లు పట్టండి అని చెప్పి ఇస్తాడు.ఇలా ఈ వీడియో చూసి తాను గేమ్ ఆడటం మొదలుపెట్టానని తెలిపారు.ముందు రూ.10వేలు పెడితే రూ.18వేలు వచ్చింది.బాగా డబ్బులు వచ్చాయి.అలా ఒకటిన్నర నెలల్లో రూ.3లక్షలు సంపాదించాను.ఆడుతున్న క్రమంలో డబ్బులు పోగొట్టుకుంటూనే ఉన్నాను చివరికి 80 లక్షల రూపాయల వరకు అప్పు చేశానని ఈ గేమ్ కారణంగా నా జీవితమే నాశనం అయ్యింది అంటూ ఈయన తన ఆవేదన మొత్తం బయటపెట్టారు.

ఫ్యాన్స్ మీసం మెలేసేలా ఉన్న చరణ్ పెద్ది ఫస్ట్ లుక్.. బ్లాక్ బస్టర్ హిట్ పక్కా!
Advertisement

తాజా వార్తలు