దాస్ కా ధమ్కి( Das Ka Dhamki ) ఈ సినిమా ఈరోజు థియేటర్లలో విడుదల అయింది.
సినిమా విడుదలకు ముందే కాస్త హైప్ పెంచే ప్రయత్నాలు చేయడంలో విశ్వక్ సేన్( Vishwak Sen ) తర్వాతే ఎవరైనా.
గతంలో ఆయన చేసిన పిచ్చి ప్రయోగాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఒక సినిమాను ఎలా కొత్తగా మార్కెట్ చేయడం అనేది తన మొదటి సినిమా నుంచే నేర్చుకున్న విశ్వక్ సేన్ ఇప్పుడు కూడా తనదైన రీతిలో ప్రయోగాలు చేసుకుంటూ వెళుతున్నాడు.
ఇక తన సొంత ప్రొడక్షన్ లో తానే దర్శకుడిగా, హీరోగా, నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ అన్ని బాధ్యతలను తన భుజాలపై మోస్తూ దాస్ కా ధమ్కి అనే ఓ సినిమాను తీశాడు.ఈ సినిమా మొదటి షో నుంచే భిన్నమైన టాక్ వస్తోంది.
అనేక సినిమాల కలయిక గా లేదా కిచిడీగా వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారు అనే సంగతి పక్కన పెడితే విశ్వక్ కీ మాత్రం ఈ సినిమా అంతా వర్కౌట్ అయ్యే కాన్సెప్ట్ కాదని చెప్పక తప్పదు.కిలాడి మరియు ధమాకా సినిమాలను కలిపితే వచ్చిందే దాస్ కా ధమ్కి చిత్రం.
ఇక ఈ మాత్రం సినిమాకి తన తండ్రి కరాటే రాజు పేరు వాడుతూ చాలా హడావిడి చేసి కష్టపడి సినిమా తీసినట్టుగా చెప్పుకుంటున్నాడు విశ్వక్ మరి జనాల చేత మార్కులు వేయించుకోవడంలో విఫలమవుతున్న విశ్వక్ కి ఆటిట్యూడ్ లో మాత్రం ఎలాంటి ఢోకా లేదు.
ఈ సినిమాలో హైపర్ ఆది చేత డైలాగులు రాయించుకుంటున్న రాయించుకున్నట్టు ఉన్నాడు విశ్వక్ కానీ కథ తానే రాసుకొని స్క్రీన్ ప్లే కూడా తానే చేసుకున్నాడు.టాలీవుడ్ చిత్రాలకు పెద్దవాళ్లు లాజిక్ తో పని లేదు కాబట్టి అలాంటి లాజిక్ లేని సీన్లు ఈ చిత్రంలో బోలెడు ఉన్నాయి.అసలు ఇవన్నీ పక్కన పెడితే మితిమీరిన బూతులు, చెత్త వివాదాలు, తల తోక లేని ఆటిట్యూడ్ తగ్గించుకోకపోతే ముందు ముందు విశ్వక్ సేన్ కి చాలా కష్టాలు ఉంటాయి.
ఆఖరికి మొన్న ఉగాది సంబరాలు అంటూ ఒక టీవీ ఛానల్ లో ప్రమోషన్ కోసం వచ్చి కూడా ఫ్యామిలీ లేడీస్ వాడకూడని ఒక బూతు పదం వాడేసాడు ఇలా కొనసాగితే ఎలా చెప్పండి బాసు అంటూ విశ్వక్సేన్ అభిమానులు తల పట్టుకుంటున్నారు.ఇక దర్శకత్వం, నిర్మాణం అనే వాటికి పోకుండా కేవలం తన దగ్గరికి వచ్చిన ఏదో ఒక కథలో హీరోగా నటిస్తే చాలు అని సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy