ఆ సెంటిమెంట్ ప్రకారం బ్రహ్మాస్త్ర సినిమా ఫ్లాప్.. టెన్షన్ లో నాగ్ ఫ్యాన్స్!

స్టార్ హీరో నాగార్జున సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి.హిందీ సినిమాలలో కూడా నటించి నాగ్ విజయాలను సొంతం చేసుకున్నారు.

కాలానికి అనుగుణంగా మారే స్టార్ హీరోలలో నాగార్జున ఒకరు.ఈ ఏడాది బంగార్రాజు సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్న నాగార్జున బ్రహ్మస్త్ర సినిమాలో నటిస్తున్నారు.

తెలుగులో మాత్రం ఈ సినిమా బ్రహ్మాస్త్రం పేరుతో థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.అయితే నాగార్జున గెస్ట్ రోల్స్ లో నటించిన సినిమాలు ఎక్కువగా సక్సెస్ సాధించలేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఇందుకు సంబంధించి పలు సినిమాలను నెటిజన్లు ఉదాహరణలుగా చూపుతున్నారు.1992 సంవత్సరంలో ఖుదా గవా అనే హిందీ మూవీలో నాగార్జున నటించగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు.ఆ తర్వాత నాగ్ బేచారా అనే మూవీలో గెస్ట్ రోల్ లో నటించగా ఈ సినిమా కూడా కమర్షియల్ గా సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.

మరికొన్ని హిందీ సినిమాలలో నాగ్ గెస్ట్ రోల్స్ లో నటించగా ఈ సినిమాలు కూడా సక్సెస్ కాలేదు.తెలుగులో తకిట తకిట, ఘటోత్కచుడు, సైజ్ జీరో, కృష్ణార్జున, అధిపతి మరికొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.

Advertisement
Negative Sentiment Tension For Nagarjuna Fans Details Here Negative , Nagarju

నాగార్జున బ్రహ్మాస్త్రం సినిమాతో ఈ సెంటిమెంట్ ను కచ్చితంగా బ్రేక్ చేయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

Negative Sentiment Tension For Nagarjuna Fans Details Here Negative , Nagarju

నాగార్జున ప్రస్తుతం ఒక్కో సినిమాకు 5 నుంచి 8 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.నాగార్జున ప్రస్తుతం నటిస్తున్న సినిమాలతో సక్సెస్ సాధిస్తే రెమ్యునరేషన్ ను పెంచే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.స్టార్ హీరో నాగార్జున మరెన్నో సంచలన విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు