తుమ్మ ముళ్లు కావాలా? పువ్వాడ పువ్వులు కావాలా?.: కేసీఆర్

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం చాలా చైతన్యవంతమైన ప్రాంతమని తెలిపారు.

ఎన్నికల్లో అభ్యర్థుల గుణగణాలు చూసి ప్రజలు ఓటు వేయాలని కేసీఆర్ తెలిపారు.ప్రజలే ఓటే రాష్ట్ర భవిష్యత్ ను నిర్ణయిస్తుందన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఖమ్మం ఎంతో అభివృద్ధి చెందిందని కేసీఆర్ పేర్కొన్నారు.పువ్వాడ అజయ్ కుమార్ ను గెలిపిస్తే పువ్వుల్లో పెట్టి చూసుకుంటారన్న ఆయన తుమ్మలను గెలిపిస్తే తుమ్మ ముళ్లు గుచ్చుకుంటాయని విమర్శించారు.

ఈ క్రమంలో తుమ్మ ముళ్లు కావాలా? పువ్వాడ పువ్వులు కావాలా? అనేది ప్రజలే ఆలోచించాలని సూచించారు.

Advertisement
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 26, శుక్రవారం, కార్తీక మాసం, 2021

తాజా వార్తలు