బాగా తగ్గించేసిన నయన్.. మంచిదే అంటోన్న ప్రొడ్యూసర్స్

తమిళ స్టార్ బ్యూటీ నయనతారకు తమిళంతో పాటు తెలుగులో కూడా అంతే ఫాలోయింగ్ ఉంది.

స్టార్ హీరోయిన్‌గా కోలీవుడ్‌లో తన సత్తా చాటుతున్న ఈ బ్యూటీ స్టార్ హీరోల స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే.

నయన్ ఎంత బిజీగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి తమ సినిమాల్లో నటింపజేసుకుంటారు అక్కడి నిర్మాతలు.

కానీ ఇటీవల వరుస వివాదాలకు కేరాఫ్‌గా నయన్ మారడంతో ఆమె సినిమాలు చాలా వరకు తక్కువ చేసిందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.గతంలో నయన్ మెయిన్‌లీడ్‌గా పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌లుగా నిలిచాయి.

అయితే ప్రస్తుతం స్టార్ హీరోల సరసన నటిస్తున్న నయన్, తన రెమ్యునరేషన్ విషయంలో కూడా అందరినీ అవాక్కయ్యేలా చేసింది.ఇటీవల రజినీకాంత్ దర్బార్ చిత్రంలో అమ్మడు రూ.5 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంది.కాగా ఇప్పుడు మరోసారి రజినీకాంత్‌తో నటిస్తున్న సినిమాలో నయన్ రూ.10 కోట్లకు పైగా తీసుకుంటుందని కోలీవుడ్‌లో వార్తలు వచ్చాయి.కానీ అదంతా కేవలం పుకార్లే అని చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వెల్లడించింది.

Advertisement

ప్రస్తుతం నయన్ తన రెమ్యునరేషన్ తగ్గించిందని, దర్బార్ చిత్రంతో పోలిస్తే 20 శాతం తక్కువగా తీసుకుందని వారు చెబుతున్నారు.ఇలా ఓ స్టార్ హీరోయిన్ తన రెమ్యునరేషన్ తగ్గించడం అంటే నిజంగానే విశేషమని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

ఏదేమైనా రెమ్యునరేషన్ తగ్గించినా కూడా వార్తల్లోకెక్కింది తమిళ బ్యూటీ నయనతార.

Advertisement