దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటి నయనతార( Nayanatara ) ఒకరు.
ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక ఈమె గత ఏడాది దర్శకుడు విఘ్నేష్ శివన్( Vignesh Shivan ) ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.అలాగే ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు.
ఇలా ఒకవైపు తల్లిగా బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు నటిగా నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.ఇక నయనతార నాలుగు పదుల వయసుకు దగ్గర పడుతున్న ఎంతో అందంగా రోజురోజుకు తన అందాన్ని రెట్టింపు చేసుకుంటూ ఉన్నారు.
ఈ విధంగా ఈమె చాలాఫిట్ గా అందంగా ఉండడానికి కారణాలను తెలియజేశారు.తన అందాన్ని రెట్టింపు చేయడం కోసం తాను సరైన డైట్ ఫాలో అవ్వడమే కాకుండా ప్రతిరోజు యోగ తప్పనిసరిగా చేస్తానని ఈమె తన బ్యూటీ సీక్రెట్( Beauty Secret ) బయటపెట్టారు.శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడం కోసం వర్కౌట్ చేయడం యోగ(Yoga) చేయడం చాలా ముఖ్యమంటూ చెప్పుకోచ్చారు.
రోజుకు రెండు గంటలపాటు యోగా తప్పనిసరిగా చేస్తారట.అలాగే 8 గంటల పాటు తప్పకుండా ఈమె నిద్రపోతారని తెలుస్తుంది.
ఇలా యోగ వర్కౌట్స్ మాత్రమే కాకుండా మంచి డైట్ ఫాలో అవుతున్నారని తెలుస్తుంది.ప్రతిరోజు ఆహార పదార్థాలలో భాగంగా కొబ్బరి నీళ్ళు (Coconut Water)ఉండేలా జాగ్రత్త పడతారట అదే విధంగా ఉదయం అల్పాహారంతో పాటు పళ్ళరసం తప్పనిసరిగా తీసుకుంటారట.ఇక మధ్యాహ్నం భోజనంలో నాన్ వెజ్ తో పాటు గుడ్డు కాయగూరలను సమపాళ్లల్లో తీసుకుంటారని తెలుస్తోంది.
ఇక కార్బోహైడ్రేట్స్ కలిగిన ఆహార పదార్థాలకు దూరంగా ఉంటారట.ఈ విధంగా నయనతార డైట్ ఫాలో అవుతూ తన అందాన్ని ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ ఉన్నారని నయనతార బ్యూటీ సీక్రెట్ ఇదేనని తెలుస్తుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy