భర్త విగ్నేష్ కి షాక్ ఇచ్చిన నయనతార.. ఏం జరిగిందంటే?

సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి నయనతార( Nayanatara ) ఒకరు.

ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నటువంటి హీరో ఇంకా నయనతార ముందు వరుసలో ఉన్నారు.ఇటీవల బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తో జతకట్టి బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు అక్కడ కూడా ఈమె ఏకంగా 1000 కోట్ల సినిమాని చేసి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పేరు ప్రఖ్యాతలను సంపాదించారు.

Nayanatara Quite Her Husband Vignesh Lic Movie , Nayanatara, Vignesh Shivan, Lic

ఇక ఈమెకు బాలీవుడ్( Bollywood ) ఇండస్ట్రీలో కూడా అవకాశాలు వస్తాయి అనడంలో సందేహం లేదు.ఇలా వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి నయనతార రెమ్యూనరేషన్ విషయంలో కూడా భారీగా డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుంది.ప్రస్తుతం 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్టు సమాచారం.

ఇక నయన తార ఎంత డిమాండ్ చేసిన నిర్మాతలు ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఆమె అడిగినది మొత్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.

Nayanatara Quite Her Husband Vignesh Lic Movie , Nayanatara, Vignesh Shivan, Lic
Advertisement
Nayanatara Quite Her Husband Vignesh Lic Movie , Nayanatara, Vignesh Shivan, Lic

అయితే తాజాగా నయనతార తమిళ చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలు చేస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే తన భర్త విగ్నేష్ శివన్ ( Vignesh Shivan ) దర్శకత్వంలో ఎల్ఐసి ( LIC ) అనే సినిమా చేయబోతున్నారు అయితే ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయడంతోనే వివాదంలో చిక్కుకుంది.ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ టైటిల్ పై కోర్టును ఆశ్రయించింది అంతేకాకుండా నిర్మాతలతో నయనతారకు విభేదాలు రావడంతో ఈమె ఏకంగా ఈ సినిమా నుంచి తప్పుకోవాలని ఆలోచనలో కూడా ఉన్నారని తెలుస్తోంది.ఇలా తన భర్త దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నయనతార నటించడం లేదు అని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు అయితే ఈ విషయం గురించి ఎక్కడా క్లారిటీ లేదు.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు