కొడుకులతో ఆటోలో ప్రయాణం చేస్తూ చిల్ అవుతున్న నయనతార.. వీడియో వైరల్!

సౌత్ ఇండస్ట్రీలో లేడీస్ సూపర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటి నయనతార( Nayanatara ) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

నయనతార ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

నయనతార ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అవుతున్నప్పటికీ హీరోయిన్గా సినిమా అవకాశాలను అందుకుని స్టార్ హీరోయిన్గా దూసుకుపోతూ ఉన్నారు.

ఇప్పటివరకు తెలుగు తమిళ భాష చిత్రాలలో నటించినటువంటి నయనతార ప్రస్తుతం బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే షారుక్ ఖాన్ తో కలిసి జవాన్ సినిమాలో నటించినటువంటి ఈమె త్వరలోనే సంజయ్ లీల భన్సాలీ దర్శకత్వంలో మరొక సినిమాకి కమిట్ అయ్యారని తెలుస్తోంది.అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన తెలియజేయనున్నారు.

ఇలా సినిమాల పరంగా నయనతార ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తన వ్యక్తిగత జీవితంలో కూడా అంతే సంతోషంగా గడుపుతున్నారు.గత కొన్ని సంవత్సరాలుగా దర్శకుడు విగ్నేష్( Vignesh ) తో ప్రేమలో ఉన్నటువంటి నయనతార గత రెండు సంవత్సరాల క్రితం తనని పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.

Advertisement

అంతేకాకుండా సరోగసి ద్వారా వీరికి ఇద్దరు కవల పిల్లలు కూడా జన్మించారు.

ఇక నయనతార విగ్నేష్ తన పిల్లల విషయంలో ఎంతో బాధ్యతగా ఉంటూ వారి ఆలనా పాలన చూసుకుంటూ ఉన్నారు అయితే తమ పిల్లలకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు.ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఉన్నటువంటి నయనతార కొన్ని వందల కోట్లను సంపాదించారు అనే విషయం మనకు తెలిసిందే.లగ్జరీ కార్లు బంగ్లాలతో పాటు ఈమెకు ప్రైవేటు జట్ కూడా ఉంది.

ఇలా ఎంతో లగ్జరీ లైఫ్ గడిపే ఈమె తాజాగా ఆటో( Auto ) లో ప్రయాణం చేస్తూ కనిపించారు.తన ఇద్దరి కొడుకులతో ఆటోలో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి వీడియోని నయనతార సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.

తన ఇద్దరు పిల్లలతో ఈమె ఆటోలో ప్రయాణం చేస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారని తెలుస్తుంది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు నెటిజన్స్ విభిన్న రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!
Advertisement

తాజా వార్తలు