నయన్‌, సమంత తెలుగు ఫ్యాన్స్ కు ఆ విషయంలో క్లారిటీ

సమంత, నయనతార హీరోయిన్స్‌ గా విజయ్ సేతుపతి హీరోగా నటించిన కాతువాకుల రెండు కాదల్ అనే తమిళ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తమిళంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఆ సినిమాకు సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్‌ తేదీ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తెలుగు లో ఓటీటీ స్ట్రీమింగ్‌ ఉందా లేదా అంటూ చాలా మంది అనుమానంతో ఉన్నారు.కాని అసలు విషయం ఏంటీ అంటే థియేట్రికల్‌ రిలీజ్ లో తెలుగు వర్షన్ ను విడుదల చేయడం కాస్త ఇబ్బంది అయినా కూడా ఓటీటీ లో మాత్రం వెంటనే తెలుగు వర్షన్ ను కూడా విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా సమాచారం అందుతోంది.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా ను ప్రతిష్టాత్మకంగా రేపటి నుండి స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు.ఈ విషయంలో సినిమా విడుదల తేదీకి సంబంధించిన వార్తలు కొందరికి గందరగోళం ను గురి చేశాయి.

కాని డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ లో మే 27వ తారీకున తమిళ వర్షన్‌ తో పాటు సౌత్‌ అన్ని భాష ల్లో అంటే తెలుగు, కన్నడం మరియు మలయాళంలో కూడా ఈ సినిమా ను స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు.తెలుగు ప్రేక్షకుల్లో చాలా మంది సమంత మరియు నయనతా అభిమానులు ఉన్నారు.

Advertisement

పై గా ఈ సినిమా లో విజయ్ సేతుపతి హీరోగా నటించడం వల్ల అంచనాలు ఆకాశాన్ని తాకాయి.అందుకే సినిమా ను ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్‌ చేస్తామా అంటూ ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూశారు.

ఎట్టకేలకు సినిమా రేపటి నుండి స్ట్రీమింగ్‌ కు సిద్దంగా ఉందని తేలిపోయింది.కనుక తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా ను స్ట్రీమింగ్‌ చేసేందుకు రెడీ అయ్యారు.

ఇది ఖచ్చితంగా సమంత, నయనతార తెలుగు అభిమానులకు గుడ్‌ న్యూస్.థియేటర్‌ లో చూడాలని ఆశ పడ్డా కూడా కొన్ని కారణాల వల్ల చూడలేక పోయారు.

ఇప్పుడు ఓటీటీ లో తెలుగు ప్రేక్షకులు చూడబోతున్నారు.

కంటినిండా నిద్ర‌పోతే పొట్ట త‌గ్గుతుంద‌ట తెలుసా..
Advertisement

తాజా వార్తలు